Hyderabad Metro: నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. పార్టీలు, దావత్‌ల కోసం యువత ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో, విద్యార్థులు, ఉద్యోగులు ఒక రేంజ్‌లో ఆనందించాలని నిశ్చయించుకున్నారు. ఇందుకోసం రకరకాల ప్రణాళికలు రూపొందించారు. స్నేహితులంతా కలిసి అర్ధరాత్రి వరకు ఎంజాయ్ చేసి, 12 గంటలకు కేక్ కట్ చేసి, కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకాలని చాలా మంది అనుకుంటారు. అయితే అర్ధరాత్రి వరకు తిరిగి తమ గమ్యస్థానాలకు ఎలా చేరుకోవాలోనని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని.. హైదరాబాద్ లో మెట్రో నిర్వహణ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 31 (ఆదివారం) అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని ప్రకటించారు. చివరి రైలు అర్ధరాత్రి 1 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని పేర్కొంది.
Read also: Maharashtra Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం!
రెడ్, బ్లూ, గ్రీన్ లైన్లలో మెట్రో రైళ్లు అర్ధరాత్రి వరకు నడుస్తాయని మెట్రో ఎండీ వెల్లడించారు. మెట్రో రైలు సమయం పెంపుతో పాటు ఆ సమయంలో భద్రత విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. మెట్రో రైలు స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా కూడా ఉంటుంది. ప్రయాణికులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. మద్యం తాగి మెట్రో స్టేషన్లలోకి ప్రవేశించినా, ఇతరులను దూషించినా, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే.. ముఖ్యంగా వ్యసనపరులకు ఈ మెట్రో సేవలు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. దొరికితే బ్యాండు భజన అని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మందు బాబులు మద్యం తాగి ఇళ్లకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడాల్సి వస్తోంది. అలాంటి వారికి మెట్రో రైళ్లలో ఎంచక్కా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్లే అవకాశాన్ని మెట్రో యాజమాన్యం కల్పించింది.
Maharashtra Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు సజీవదహనం!