Metro Employees: హైదరాబాద్ మెట్రోలో టికెటింగ్ కౌంటర్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు రెండో రోజు కూడా విధులు బహిష్కరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళనకు దిగారు. హైదరాబాద్ మెట్రో రైల్వేలో టికెటింగ్ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిన్నటి నుంచి విధులకు దూరంగా ఉన్నారు. నిన్న ఉదయం నుంచి ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు. నిన్న ఒకసారి హైదరాబాద్ మెట్రో రైల్వే యాజమాన్యం కాంట్రాక్ట్ ఉద్యోగుల ప్రతినిధులతో చర్చలు జరిపింది. అయినా కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యను మెట్రో యాజమాన్యం పరిష్కరించలేకపోయింది. దీంతో ఇవాళ కూడా కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్‌లు పూర్తీ చేయాలని సమ్మె చేస్తున్నారు. మెట్రో యాజమాన్యం ప్రయాణికులకు ఇబ్బంది తలెత్తకుండా.. తాత్కాలిక సిబ్బందితో టికెట్ల కౌంటర్లలో కూర్చొబెట్టి సమస్య తలెత్తకుండా చూసుకుంటోంది. అయితే ఇది కరెక్ట్ పద్దతి కాదంటూ జీతాలు పెంచాలంటూ మెట్రో సిబ్బంది సమ్మె కొనసాగిస్తున్నారు.
Read also: Best plans of 2023: బెస్ట్ ఇయర్లీ ప్లాన్స్.. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ అదిరిపోయే ఆఫర్స్..
ఎల్.బీ.నగర్- మియాపూర్ రూట్ లో ఉన్న 27 టికెటింగ్ కౌంటర్లలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు.తమ వేతనాలు పెంచాలని కాంట్రాక్టు ఉద్యోగులు కోరుతున్నారు. ఐదేళ్ల క్రితం విధుల్లో చేరిన వారికి రూ. 11 వేల వేతనం ఇస్తున్నారు. కొత్తగా విధుల్లో చేరిన వారికి కూడా రూ.11 వేలు చెల్లిస్తున్నారు. సీనియర్లు, జూనియర్లకు ఒకే వేతనం చెల్లించడంపై కాంట్రాక్టు ఉద్యోగులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ వేతనాలు పెంచాలని 15 వేల నుంచి 18 వేల రూపాయల వరకు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అమీర్‌పేట్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో టికెట్ల కోసం ప్రయాణికులు భారీగా క్యూ కట్టారు.
Formula E Hyderabad: ఫిబ్రవరి 11న ఫార్ములా-ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్.. బుక్ మై షోలో టికెట్స్