Drunken Drive : నగరంలో వీకెండ్ ట్రాఫిక్ తనిఖీల్లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు వెలుగుచూశాయి. శనివారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న 474 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనదారులే ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత మూడు చక్రాల వాహన డ్రైవర్లు, కార్లు తదితర నాలుగు చక్రాల వాహనదారులు ఉన్నారు. తొమ్మిది మందిలో అత్యంత అధిక స్థాయిలో ఆల్కహాల్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.…