ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లి ట్రాప్ అయ్యాడు..!! అదృష్టం బాగుండి కొన్నాళ్లకు తిరిగొచ్చాడు. తనలా మరొకరు మోసపోకుండా ఉండాలని కోరుకోవాల్సింది పోయి.. ఉద్యోగాల ఆశ చూపి అమాయకులను విదేశాలకు పంపాడు. ఇదీ చాలదన్నట్టు స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతూ కోట్లు కొల్లగొడుతున్నాడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో అడ్డంగా బుక్కై.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు.
Fake Facebook Account in Telangana BJP: తెలంగాణ బీజేపీ పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సెంట్రల్ జోన్, సైబర్ వింగ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నకిలీ ఖాతాలో అభ్యంతరకరమైన, తప్పుడు కథనాలను పోస్ట్ చేస్తున్నారని.. ఇది భారతీయ జనతా పార్టీ శ్రేణులలో గందరగోళం, విభేదాలకు కారణమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Digital Arrest : హైదరాబాద్ నగరంలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మహిళకు టోకరా వేసిన సంఘటన సంచలనంగా మారింది. సైబర్ నేరగాళ్లు ఆమె ఆస్తులన్నీ తాకట్టు పెట్టించి కోట్ల రూపాయల మోసం చేశారు. ఈ కేసులో ప్రముఖ నాట్యాచార్యుడు, పేర్ని రాజ్‌కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ్‌కుమార్ సైబర్ నేరగాళ్లకు ముల్ అకౌంట్లను (ఫేక్ అకౌంట్లు) అందించడంలో కీలకపాత్ర పోషించినట్టు విచారణలో తేలింది. డిజిటల్ అరెస్ట్ మాయతో ఓ మహిళను మోసం చేసిన నిందితులు…
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన భారీ సినిమా పైరసీ కేసులో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జన కిరణ్ కుమార్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కిరణ్ గత ఏడాదిన్నర కాలంలో 40 పెద్ద తెలుగు, తమిళ సినిమాలను పైరసీ చేసి, వాటిని 1Ta******er, 1t****v, 5M****z వంటి వెబ్‌సైట్‌లకు అమ్మినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు సుమారు రూ.3700 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. Also…
ఒక ఐడియా వారి జీవితాన్ని కటకటాలపాలు చేసింది. రిస్క్ లేకుండా డబ్బు సంపాదించడం కోసం వారు వేసిన స్కెచ్ కాస్తా బెడిసి కొట్టింది. సభ్యసమాజం తలదించుకునే పని చేసిన దంపతులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అంబర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటన అత్యంత జుగుప్స కలిగిస్తోంది. ఇది ఎక్కడో విదేశాల్లో కాదు.. మన హైదరాబాద్‌లోనే జరిగింది. అది కూడా అంబర్ పేట్ అడ్డాగా చేసుకుని ఈ దంపతులు పడక సీన్లను రికార్డ్ చేస్తున్నారు. Also Read:TEJESHWAR Case:…
Online Adult Content: హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట ప్రాంతంలో దంపతులు కలిసి నిర్వహిస్తున్న లైవ్ న్యూడ్ వీడియో వ్యాపారం కలకలం రేపుతోంది. పక్కా ప్రణాళికతో నిర్వాహకుల్లా వ్యవహరిస్తూ, ఆన్ లైన్ లో తమ వీడియోలు అప్లోడ్ చేస్తూ.. డబ్బు తీసుకుని ప్రజలకు లింక్ పంపుతున్న ఈ వ్యవహారం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడితో బట్టబయలైంది. ఈ దంపతులు గత నాలుగు నెలలుగా “స్వీటీ తెలుగు కపుల్ 2027” అనే పేరుతో ఇన్‌స్టాగ్రామ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ ఫారమ్…
హైదరాబాద్ లో జోనల్ సైబర్ సెల్స్ ను కమిషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. నిన్నటి వరకు కమిషనరేట్ కు ఒకే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉండేది. నేటి నుంచి జోన్ ల వారికి అమలు లోకి రానున్నాయి. సైబర్ క్రైమ్ నేరాల సంఖ్య పెరుగుతుండటంతో జోనల్ సైబర్ సెల్స్ అమలులోకి వచ్చాయి. ఇక పై ప్రతి జోన్ లో ఒక్కో సైబర్ సెల్ స్టేషన్ ఉంటుంది. కాగా.. గడిచిన 9 సంవత్సరాల్లో సైబర్ నేరాలు 786…
Cyber Fraud Village : ఐదు రాష్ట్రాల్లో భారీ ఆపరేషన్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ సిబ్బంది.. 23 మంది సైబర్ నేరగాళ్లను పట్టుకున్నారు. ఈ అరెస్ట్‌ల వివరాలను సైబర్ క్రైమ్ డీసీపీ కవిత వెల్లడిస్తూ.. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతుండటంతో నిందితులను పట్టుకునేందుకు ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో 23 మంది సైబర్ నేరగాళ్ళని పట్టుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రలలో నిందితులు నేరాలకు పాల్పడినట్లు…
Harsha Sai: కలకలం రేపిన హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషాని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.. హర్ష సాయి బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా శేఖర్ భాషాని అదుపులోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ప్రస్తుతం ఆయనని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మూడు గంటలగా సైబర్ క్రైమ్ ఆఫీస్ లో ఆర్జె శేఖర్ భాషాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలికి సంబంధించిన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నందుకు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఆమెపై అసత్య ప్రచారాలు చేసినందుకు…
Cyber Crime in SBI Bank: దేశంలో రోజురోజుకు ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొత్తకొత్త మార్గాల్లో అమాయకుల బ్యాంక్ ఖాతా నుండి డబ్బును ఈజీగా దొంగిలిస్తున్నారు. అమాయక ప్రజలనే కాదు.. బ్యాంక్‌లను కూడా దోచేసుకుంటున్నారు. తాజాగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కే టోకరా వేశారు. ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఏకంగా 175 కోట్లు మాయం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ షంషీర్గంజ్ ఎస్బీఐ బ్యాంక్‌లో చోటుచేసుకుంది. సైబర్…