ఒక ఐడియా వారి జీవితాన్ని కటకటాలపాలు చేసింది. రిస్క్ లేకుండా డబ్బు సంపాదించడం కోసం వారు వేసిన స్కెచ్ కాస్తా బెడిసి కొట్టింది. సభ్యసమాజం తలదించుకునే పని చేసిన దంపతులిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అంబర్‌పేట్‌లో జరిగిన ఈ ఘటన అత్యంత జుగుప్స కలిగిస్తోంది. ఇది ఎక్కడో విదేశాల్లో కాదు.. మన హైదరాబాద్‌లోనే జరిగింది. అది కూడా అంబర్ పేట్ అడ్డాగా చేసుకుని ఈ దంపతులు పడక సీన్లను రికార్డ్ చేస్తున్నారు.
Also Read:TEJESHWAR Case: గద్వాల తేజేశ్వర్ మర్డర్ కేసు.. అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..
ఇద్దరికీ రీల్స్ చేసే అలవాటు
నిజానికి ఈ దంపతులు సోషల్ మీడియాలో చాలా కాలంగా గడుపుతున్నారు. ఇద్దరికీ రీల్స్ చేసే అలవాటు ఉంది. వారు పెట్టిన రీల్స్‌కు మంచి వ్యూస్ వస్తున్నాయి. ఐతే ఆ డబ్బులు సరిపోవడం లేదనే ఉద్దేశ్యంతో ఎవరూ ఊహించని స్కెచ్ వేశారు. అందరికీ భిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో మిడ్ నైట్ మసాలా కంటెంట్ ఎంచుకున్నారు. వారు చేసే రీల్స్ స్థానంలో ఈ షార్ట్ ఫిల్మ్స్ పోస్ట్ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి స్కిట్లు వేసి లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నారు.
Also Read:Dhanush : ధనుష్ లాంటి పాత్రలు టాలీవుడ్ లో చేసేది ఆ ఒక్కడే..!
ఈ కపుల్ పెట్టిన పోర్న్ కంటెంట్‌కు ఎక్కువ ఆదరణ రావడంతో మరింత రెచ్చిపోయారు. ఏకంగా లైవ్ కూడా స్టార్ట్ చేశారు. లైవ్‌కు కొంత రేట్ ఫిక్స్ చేశారు. అలాగే రికార్డెడ్ వీడియోలకు కూడా ధర నిర్ణయించి అమ్ముకున్నారు. అలా తమను సంప్రదించే కస్టమర్లకు వీడియోలు అమ్ముతున్న వీరిద్దరూ.. యుపీఏ ద్వారా చెల్లింపులు స్వీకరించారు. ఫోన్ పే, గూగుల్ పే నెంబర్లకు యుపీఏ చెల్లింపులు చేయగానే తమ వీడియోలు షేర్ చేసేవారు.
స్వీట్ కపుల్ 2027 పేరిట పోర్న్ కంటెంట్
ఈ దంపతులు స్వీట్ కపుల్ 2027 పేరిట ఈ పోర్న్ కంటెంట్ చిత్రీకరించి అమ్ముతున్నారు. ఈ వ్యాపారం కొన్నాళ్లు బాగానే నడిచింది. ప్రతి రోజూ కస్టమర్లకు అందుబాటులో ఉంటూ.. డబ్బులు కూడా బాగానే సంపాదించారు. ఐతే మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న ఈ యాపారం గురించి ఆ నోటా.. ఈ నోటా పోలీసులకు సమాచారం అందింది.
Also Read:War2- coolie : 50 డేస్ కౌంట్ డౌన్.. ఏంటీ కొత్త ట్రెండ్..
కెమెరా, లైవ్ లింక్ పరికరాలు స్వాధీనం
ఇంకేముంది.. ఠక్కున అంబర్‌పేట్‌లోని వాళ్ల ఇంటిపై వాలారు పోలీసులు. వారు రాసలీలలు చేస్తున్న ఇంటిపై రైడ్ చేశారు. వారి దగ్గర కెమెరా, లైవ్ లింక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.