బండ్ల గూడలో డబల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డబల్ బెడ్ రూమ్ సూపర్ వైజర్‌తో కుమ్మక్కైన మోసగాళ్లు ప్లాట్ బాధితులకు చూపించారు. 40 మంది బాధితులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫిక్స్ యాప్ ద్వారా సర్టిఫికేట్లు తయారు చేసి డబల్ బెడ్ రూమ్ మంజూరు అయినట్లు సర్టిఫికేట్ క్రియేట్ చేశారు.
నగరంలోని ఎల్బీనగర్ పోలీసులకు డ్రగ్ మాఫియాపై భారీ విజయం లభించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.1.2 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని హాష్ ఆయిల్గా మార్చి, చిన్న చిన్న బాటిళ్లలో గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్న స్మగ్లర్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. గంజాయి స్మగ్లర్లు కొత్త తంత్రాన్ని ఎంచుకున్నారు. భారీగా ప్యాకెట్లు తరలించడం కష్టంగా మారడంతో హాష్ ఆయిల్ రూపంలో గంజాయిని మారుస్తున్నారు. హాష్ ఆయిల్‌కు ప్రత్యేక…
Raj Bhavan : రాష్ట్ర పరిపాలన కేంద్రంగా నిలిచే తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగతన ఘటన చోటు చేసుకుంది. సుధర్మ భవన్‌లోని కంప్యూటర్ గదిలో ఉన్న నాలుగు హార్డ్‌డిస్క్‌లు మాయమవ్వడంతో భద్రతా యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ నెల 14వ తేదీ రాత్రి జరిగిన ఈ చోరీ విషయాన్ని రాజ్‌భవన్ సిబ్బంది గుర్తించి, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన గది మొదటి అంతస్తులో ఉండగా, దానిలోకి హెల్మెట్ ధరించి ప్రవేశించిన వ్యక్తి కనిపించాడు. సీసీటీవీ…
Murder : నగరంలోని రద్దీగా ఉండే నాంపల్లి ప్రాంతంలో పట్టపగలు ఓ దారుణ హత్య జరిగింది. ఓ హోటల్లో టీ తాగడానికి వచ్చిన వ్యక్తిని ఐదుగురు దుండగులు కత్తులతో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే, మృతుడు నాంపల్లిలోని ఓ ఆసుపత్రి ఎదురుగా ఉన్న హోటల్‌కు టీ తాగడానికి వచ్చాడు. ఇంతలో ఒక్కసారిగా ఐదుగురు వ్యక్తులు కత్తులతో అతనిపై విరుచుకుపడ్డారు. క్షణాల్లోనే అతడిని…
Chandrayangutta Murder: మే 8న చంద్రాయణగుట్టలోని బాధితురాలి ఇంటికి వెళ్లి, అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత నిందితుడు జుల్ఫికర్ ఆమె గొంతు కోసి చంపాడు. ఆ తర్వాత అతను పరుపుకు నిప్పంటించి మృతదేహాన్ని తగలబెట్టడానికి ప్రయత్నించాడని డీసీపీ పి. కాంతిలాల్ సుభాష్ తెలిపారు. హత్య గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానం రావడంతో వారు జుల్ఫికర్ను అరెస్టు చేశారు. విచారణలో అతను ఆ మహిళను హత్య చేసినట్లు అంగీకరించాడు. అతన్ని…
Fake Certificates: హైదరాబాద్‌లో నకిలీ విద్యా సర్టిఫికెట్ల విక్రయాలను చేపట్టిన ముఠాను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బుధవారం గుట్టురట్టు చేశారు. కన్సల్టెన్సీ పేరుతో మోసాలను కొనసాగిస్తూ యువత భవిష్యత్‌ను నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ముఠాపై పోలీసులు ఘాటుగా స్పందించారు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరుతో ఈ నకిలీ దందాను నిర్వహిస్తున్న మహ్మద్ ముజీబ్ హుస్సేన్‌ను పోలీసులు పట్టుకున్నారు. మే 12న మాసబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ పాఠశాల వద్ద నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న సమయంలో…
Fake Police : ఐపీఎల్ టికెట్స్ కోసం ఓ వ్యక్తి సూడో పోలీస్ గా మారాడు.. 16 టికెట్లు కొనుగోలు చేసిన ఓ యువకుడిని బెదిరించి టికెట్లు తీసుకొని పారిపోయాడు.. సికింద్రాబాద్ బేగంపేట్ లోని జింకన్ గ్రౌండ్ వద్ద యాదగిరిగుట్టకు చెందిన రాకేష్ అనే యువకుడు తన మిత్రుల తో కలిసి 16 టికెట్లు బుక్ చేశారు.. జింకన్న గ్రౌండ్ HCA లో టికెట్లు తీసుకొని వెళ్తుండగా.. ఓ వ్యక్తి టికెట్లు కావాలంటూ వారిని ఆపాడు.. భారీగా…
Suicide : సికింద్రాబాద్‌లోని వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక విషాద సంఘటన కలకలం రేపింది. మయ్ 4న నిశ్చితార్థం జరగాల్సిన యువకుడు, తన మిత్రుడు హత్యకు గురవడం చూసి తీవ్ర మానసిక ఆందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు ఒక్కరోజే చోటుచేసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది. బౌద్ధనగర్‌కు చెందిన మోహన్ కృష్ణ అనే బైక్ మెకానిక్కు పెళ్లి నిశ్చితార్థం మే 4న జరగాల్సి ఉంది. అయితే, నిశ్చితార్థానికి ముందు అంటే ఏప్రిల్ 27 రాత్రి మోహన్…
KPHB Mur*der: ఈ మధ్యకాలంలో దేశంలో చాలా చోట్ల భర్తలను భార్యలు వివిధ రకాలుగా చంపేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిత్ర హిల్స్ లో భర్తను చంపి పాతిపెట్టిన కేసులో పోలీసులు ఫిర్యాదు అందిన రెండు రోజుల్లోనే కేసును చేదించారు. నిందితులు కవిత, ఆమె సోదరి జ్యోతి, మరిది మల్లేష్ లను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ…
హైదరాబాద్ మియాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అల్లుడు భార్య, అత్తపై కత్తితో దాడి చేశాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనప్రియ నగర్ లో ఘటన జరిగింది. మహేష్ అనే వ్యక్తి శ్రీదేవిని అనే యువతిని ప్రేమ వివాహం చేసుకొని క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా మహేష్, శ్రీదేవి దంపతుల మధ్య తరచూ గొడవలు చెలరేగాయి. మహేష్ నిన్న రాత్రి భార్య శ్రీదేవితోపాటు అత్తపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.