నవ మాసాలు మోసి కన్న బిడ్డను తన చేతులతో కడతేర్చింది. మైలార్ దేవ్ పల్లి ఆలీ నగర్ లో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. 15 రోజుల పసికందుని తల్లి చంపేసింది. పసికందుని బకెట్ నీళ్లలో వేసి చంపి ప్రమాదవశాత్తుగా క్రియేట్ చేసింది. స్నానం చేసి వచ్చేసరికి బకెట్లో పసికందు పడిపోయిందని నాటకమాడింది.
Advocate Murder : హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన న్యాయవాది ఇజ్రాయిల్ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. న్యాయవాదిని దారుణంగా హత్య చేసిన వ్యక్తిగా వాచ్ మెన్ దస్తగిరిని అరెస్టు చేశారు. ఈ కేసు వెనుక వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు పోలీసులు తేల్చారు. చంపపేటలో వాచ్ మెన్‌గా పనిచేస్తున్న కాంతారావు, దస్తగిరిలలో గత కొంతకాలంగా వివాదం నెలకొని ఉంది. ఈ వివాదానికి కారణం కాంతారావు భార్య కళ్యాణి. దస్తగిరి మరియు కళ్యాణి మధ్య వివాహేతర…
తిన్నింటి వాసాలు లెక్కపెట్టకూడదని పెద్దలు చెప్తుంటారు.. సహాయం చేసిన చేతులనే నరికి వేస్తున్న సంఘటనలు.. ఆకలితో వచ్చిన వాడికి అన్నం పెట్టి ఉద్యోగం ఇచ్చినందుకు చంపి పాతర వేశాడు.. తన పాడు బుద్ధులను బయట ప్రపంచానికి తెలియజేసినందుకు సహాయం చేసిన అడ్వకేట్ ని వేటాడి చంపేసిన తీరు ఇది. హైదరాబాదులోని చంపాపేట్‌లో జరిగిన దారుణ సంఘటన సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతుంది. పాతబస్తీ చంపాపేట్‌కు చెందిన ఎర్రబాబు ఇజ్రాయిల్.. ఇతను ఒక న్యాయవాది.. హైకోర్టుతో పాటు సిటీలోని…
Bandi Sanjay : ఎంఎంటీఎస్ నుండి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన…
MLC Kavitha : హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్న ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర స్పందన తెలియజేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఫోన్లో మాట్లాడారు. యువతిపై జరిగిన దాడి ఘటన గురించి పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. తనను రక్షించుకునేందుకు…
చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జోరుగా అక్రమ, కల్తీ వ్యాపారాలు సాగుతున్నాయి. పోలీసులు,అధికారులు పట్టించుకోక పోవడంతో కల్తీ రాయుల్ల వ్యాపారాలు మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. చాదర్ ఘాట్ పరిధిలోని రసూల్ పురా , వినాయక వీధి ప్రాంత స్థానికుల ఫిర్యాదుతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారి శృతి ఆలేటి ఆధ్వర్యంలో మూసీ పరివాహక ప్రాంత నివాసాల్లో దాడులు నిర్వహించారు. నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి తయారీని గుర్తించి…
Child Trafficking : చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా నుంచి రాచకొండ పోలీసులు 10 మంది చిన్నారులను రక్షించి, శిశు విహార్‌కు తరలించారు. ఈ ముఠా వివిధ ప్రాంతాల నుంచి చిన్నారులను అక్రమంగా తీసుకువచ్చి అమ్మకాలు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ముఠా ముఖ్యంగా మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, ముంబై, ఉత్తరప్రదేశ్‌లోని మురికివాడలలోని నిరుపేద కుటుంబాల పిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనంతరం వీరిని తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పిల్లలేని తల్లిదండ్రులకు అమ్ముతున్నారు. ఈ ముఠాలో…
గంజాయి డాన్ అంగూరు భాయ్‌పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎన్నిసార్లు అరెస్టు చేసిన బెయిల్ పై వచ్చి గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న అంగూరు భాయ్.. ప్రస్తుతం చంచల్ గూడ జైళ్లో ఉంది. దూల్పేట్ సీఐ మధుబాబు.. అంగూర్ భాయ్‌కి పీడీ జీవోను అందించారు. రాష్ట్రం కాని రాష్ట్రంలోకి వచ్చి.. తెలంగాణలోని దూల్పేట్లో స్థిరపడి.. గంజాయి డాన్‌గా ఎదిగిన అంగూర్ భాయ్‌పై ఎక్సైజ్ శాఖ సిఫారసు మేరకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం పీడీ…
చాదర్‌ఘాట్ పీఎస్ పరిధిలో శిరీష హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సరిత, వినయ్ కుమార్, నిహల్ కుమార్ అరెస్ట్ చేసిన పోలీసులు.. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పెట్టారు. 2016లో సరిత, శిరీష కలిసి సన్ రైజ్ హాస్పిటల్ లో పని చేశారు.. 2016 ఏప్రిల్ లో వినయ్ కుమార్ తో శిరీష పెళ్లి సెట్ చేసింది సరిత.. శిరీష 2024 లో హయత్ నగర్ వివేరలో కూడా పని చేసింది.…
CP Sudheer Babu : రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు అంతర్జాతీయ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాను ఛేదించి సంచలనం రేపారు. గుజరాత్లో జన్మించిన పసి పిల్లలను అక్రమంగా హైదరాబాద్‌కు తరలించి అమ్మకాల యత్నం చేస్తున్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా సభ్యులు ఆడ శిశువులను రూ. 2.5 లక్షలకు, మగ శిశువులను రూ. 4.5 లక్షలకు విక్రయిస్తుండగా, పోలీసుల దాడిలో వారి పథకం భగ్నమైంది. దీనికి సంబంధించిన సమాచారం ముందస్తుగా అందుకున్న…