Crime News: సమాజంలో రోజురోజుకి దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వావివరసలు మరిచి కొందరు దారుణాలకు వడిగడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి ప్రాంతంలో ఘోర ఘటన చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికను ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దుండగులు హత్య చేశారు. అందిన సమాచారం ప్రకారం తల్లిదండ్రులు పని కోసం బయలుదేరిన తర్వాత బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. అయితే, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తండ్రికి కుమార్తెను చనిపోయిన…
Khazana Jewellery : హైదరాబాద్‌లో జరిగిన ఖజానా జ్యువెలర్స్ దోపిడీ కేసులో పోలీసులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. పటాన్ చెరువు సర్వీసు రోడ్‌పై వెళ్తున్న ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా, సంగారెడ్డి సమీపంలో మరో ముగ్గురిని పట్టుకున్నారు. మొత్తం ఆరుగురు దొంగలు రెండు బైకులపై పారిపోతుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. Kantara : కాంతార టీమ్‌లో వరుస మరణాలపై స్పందించిన నిర్మాత.. ముఖాలకు మాస్కులు, తలకు క్యాపులు, చేతులకు గ్లౌజులు ధరించి ప్రయాణిస్తుండటంతో వారి కదలికలు…
Ganjai : గంజాయి, డ్రగ్స్‌పై పోలీసులు ఎంత నిఘా పెడుతున్నా.. స్మగ్లర్లు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తమ పని తాము చేసుకుపోతాం అనేలా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ గంజాయి విపరీతంగా దోరుకుతున్నా.. కస్టమర్ల కోసం విదేశాల నుంచి కూడా టాప్ రేటెడ్ గంజాయిని తీసుకు వస్తున్నారు. అలా విమానంలో గంజాయి తెచ్చిన మహిళ పోలీసులకు చిక్కింది. మరోవైపు ధూల్‌పేట్ స్మగ్లర్లు రూట్ మార్చి.. గంజాయి బదులుగా డ్రగ్ పెడ్లింగ్ చేస్తున్నారు.…
Khazana Jewellery : సాధారణంగా దొంగతనాలు అర్ధరాత్రి దాటాకే జరుగుతుంటాయి. కానీ ఈసారి హైదరాబాద్‌లో దోపిడీ దొంగలు రూట్ మార్చారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టడం లేదా గోడలకు కన్నాలు పెట్టడం..లాంటివి రిస్క్ అనుకున్నారో ఏమో.. తెల్లవారి షాపు తెరిచిన వెంటనే లోపలికి చొరబడ్డారు. నిజానికి భారీగా బంగారు ఆభరణాలు దోచుకుందామని జువెలరీ షాపుకు వచ్చారు. కానీ వారికి వెండి ఆభరణాలు తప్ప మరేమీ దొరకలేదు. తుపాకులతో కొద్దిసేపు హడావుడి చేసి వెళ్లిపోయారు. ఉదయం 10:30 గంటల సమయం..…
Cheating Gang: డబ్బు.. బంగారం అంటే ఆశ పడని వారు ఎవరు ఉంటారు? అలాంటి అత్యాశాపరులనే వారు టార్గెట్ చేస్తారు. పెద్ద మొత్తంలో సొమ్ములు వస్తాయని నమ్మిస్తారు. ఒక్కసారి వారి వలలో పడి నమ్మేశారో అంతే..!! అలాంటి అమాయక చక్రవర్తులను బుట్టలో వేసేసి.. ఉన్నదంతా ఊడ్చేస్తారు. అలా పూజల పేరుతో బురిడీ కొట్టిస్తున్న నాగ్‌పూర్ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమార్కుడు సినిమాలో హీరో రవితేజ ఇంట్రడక్షన్ సీన్ గుర్తుందా? లక్షలకు డబ్బులు వస్తాయని నమ్మించి కాలనీలో…
Shocking : హైదరాబాద్‌లోని హాఫీజ్పేట్లో వ్యాపార విభేదాలు రక్తపాతం సృష్టించాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనలో కట్టెల వ్యాపారి శ్రీనివాస్ (37) దారుణంగా హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం, వనపర్తి జిల్లా జంగమయ్యపల్లికి చెందిన శ్రీనివాస్ గత ఐదు సంవత్సరాలుగా హాఫీజ్పేట్ రైల్వే స్టేషన్ సమీపంలోని మంజీరా రోడ్డులో కర్రల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ వ్యాపారం బాగా వృద్ధి చెందడంతో, స్థానిక వ్యాపారస్తులు సోహెల్, అతని ముగ్గురు సహచరులు అసూయతో కక్ష…
POCSO : హైదరాబాద్‌లో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. దత్తత తీసుకున్న తల్లి చనిపోవడం, తండ్రి అనారోగ్యంతో మంచాన పడి.. మైనర్ బాలిక ఒంటరిగా ఉంటోందని గమనించిన యువకుడు ఆమెను ట్రాప్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. ఏకంగా ఆమె ఇంట్లో సహజీవనం చేయడం ప్రారంభించాడు. కానీ బాలిక అసలు తల్లికి విషయం తెలియడంతో యువకుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడి పేరు రవితేజ. మేడ్చల్ జిల్లా…
Hyderabad Crime : హైదరాబాద్‌లో పోకిరీల హాంగామాకు హద్దూ అదుపూ లేకుండా పోయింది. అర్థరాత్రి రోడ్ల మీద నానా హంగామా చేస్తూ జనజీవనానికి ఆటంకం కలిగిస్తున్నారు. మద్యం, గంజాయి మత్తులో జోగుతూ.. నడి రోడ్డుపై కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు. ఇలా నానా న్యూసెన్స్ చేస్తున్న పోకిరీల ఆట కట్టించాలని సిటీ జనం కోరుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో జరిగింది. ఆసిఫ్‌నగర్‌లో ఉంటున్న ముజఫర్ అనే యువకుడు తన బర్త్ డే పార్టీ కోసం మిత్రులను ఆహ్వానించాడు.…
Srushti Case: హైదరాబాద్‌లో సృష్టి ఫెర్టిలిటి సెంటర్ నిర్వాహకురాలు నమ్రతపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడిందనే ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి, ఇప్పుడు ఆమెను కస్టడీకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు. పిల్లలను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారన్న అంశంపై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో 86 మంది సరోగసీ దంపతుల వివరాలను సేకరించాలనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.…
Murder : హైదరాబాద్‌లోని బోరబండ ఇంద్రానగర్‌లో మద్యం తాగిన ఇద్దరు కజిన్ల మధ్య జరిగిన గొడవ దారుణంగా మారింది. ఈ ఘర్షణలో ఒకరు రాతితో కొట్టి మరొకరిని హత్య చేశాడు. పోలీసుల సమాచారం ప్రకారం, మృతుడు బసవరాజ్ (30), నిందితుడు ప్రేమ్‌రాజ్ ఇద్దరూ ఇంద్రానగర్ నివాసితులు. సోమవారం రాత్రి పార్వతీనగర్‌లో మద్యం సేవించిన సమయంలో వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత ఇద్దరూ ఇంటికి వచ్చి నిద్రపోయారు. Jharkhand: శిబు సోరెన్‌కు నివాళులర్పిస్తూ ఎక్కి ఎక్కి ఏడ్చిన…