Hyderabad : హైదరాబాద్ నగరంలోని పారా మౌంట్ కాలనీలో తెల్లవారుజామున పెద్దఎత్తున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, విదేశీయుల అక్రమ నివాసాలపై ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 150 మంది పోలీసులు తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఈ కాలనీని చుట్టుముట్టి సోదాలు ప్రారంభించారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, హెచ్ఎన్యూ, ఏఆర్ విభాగాలకు చెందిన పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఈ సెర్చ్లో నైజీరియా,…
హైదరాబాద్ బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి పేయింటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళంకు చెందిన గోట్టివాడ చిన్న(35).. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు.. భార్యతో గోడవ కారణంగా కొంత కాలంగా గచ్చిబౌలిలో చేల్లెలు ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ జాబ్ ఐడి కార్డులను ఫేక్ లెటర్లను తయారుచేసి బాధితులను మోసం చేసి వారి వద్ద నుంచి ఏడు లక్షల ఐదువేల రూపాయలను వసూలు చేసిన నిందితుడు హైదరాబాద్ అల్కాపురి కాలనీకి చెందిన వినయ్ కుమార్ను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు. బాధితుడు గంగాధర్ ఫిర్యాదుతో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
సరూర్నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ కేసులో సీఐడీ దూకుడు పెంచింది. తాజాగా సీఐడీ పోలీసులు కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు అరెస్టు చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు.
ఫాల్కన్ స్కాం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో సీఐడీ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. తెలంగాణ సీఐడీ బీహార్ లో ఇద్దరిని అరెస్ట్ చేసింది. పట్టుబడ్డ ఇద్దరు నిందితులు A2 అమర్ దీప్ కుటుంబ సభ్యులు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ స్కాంలో నేరస్థులుగా ఉన్నారని..
Supspend : హైదరాబాద్ బాలానగర్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు. అవినీతి ఆరోపణలతో ఎస్ఐను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ ఉత్తర్వులు. ఎస్ఐ లక్ష్మీనారాయణపై పలు అవినీతి అరోపణలు. ఓ మహిళ కేసు విషయంలో ముగ్గురిని అకారణంగా కొట్టినట్లు ఆరోపణలు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లో బాధితుల ఫిర్యాదు. హైదరాబాద్లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ ఎస్సై లక్ష్మీనారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. అవినీతి ఆరోపణలు రావడంతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు…
Ganja Smuggling: హైదరాబాద్ మహానగరంలో ప్రతిరోజు ఏదో ఒక మూలన మత్తు పదార్థాలు పోలీసుల రైడులో దొరుకుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లింగంపల్లి రైల్వే స్టేషన్లో మరోసారి గంజాయి స్మగ్లింగ్ ఘటన చోటుచేసుకుంది. గంజాయి సరఫరాకు రైలు మార్గాన్ని ఎంచుకున్న ముఠా అనుమానిత ప్రవర్తనతో పోలీసులకి చిక్కింది. తనిఖీల్లో భాగంగా కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఉన్న ఓ బ్యాగుపై అధికారులు దృష్టి సారించారు. ఆ బ్యాగు పరిశీలన చేయగా.. అందులో 13 ప్యాకెట్లుగా ప్యాక్…
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయించి సంపాదించిన డబ్బులను హవాలా మార్గంలో విదేశాలకు పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Betting Apps : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల పై నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.ఇప్పటికే ఈ కేసులో యూట్యూబర్ టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మంగళవారం రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు ఈ విచారణ జరిగింది. టేస్టీ తేజ స్టేట్మెంట్ రికార్డు చేసారు పోలీసులు. దాదాపు 11 మంది బుల్లితెర నటులు యాంకర్స్ పై ఇప్పటికే కేసులు…
అహ్మద్ నగర్ మహారాష్ట్రాకు చెందిన అభిషేక్ సంజయ్ అనే వ్యక్తి శంషాబాద్ లో ఓ సినిమా థియేటర్ వద్ద 15 గ్రాముల ఎండిఎంఎ డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు గతంలో మహారాష్ట్ర లో కిరాణా షాపుతోపాటు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. అయితే కుటుంబ కలహాలు ఆర్థిక ఇబ్బందులు రావడంతో బెంగళూరుకు మఖాం మార్చాడు. అక్కడ ఆన్ లైన్ లో డ్రగ్స్ కు సంబంధించి సెర్చింగ్ చేశాడు. దీంతో అతనికి నైజీరియన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి…