Woman Constable Suicide: ఓ మహిళా కానిస్టేబుల్‌గా.. ఆమె క్రిమినల్స్‌తో పోరాడింది.. కానీ సొంత ఇంట్లో సమస్యలతో పోరాడేందుకు ధైర్యం సరిపోలేదు. అలా అని పోలీసు ఉన్నతాధికారులతోనూ తన సమస్యను చెప్పుకోలేదు. ఫలితంగా సమస్యకు తలొగ్గి జీవితాన్ని త్యజించింది. హైదరాబాద్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ సూసైడ్ చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది.
Hyderabad: ఎనిమిదేళ్లు ప్రేమించుకున్నారు. ఇక్కడ అబ్బాయి సీరియస్‌గానే ప్రేమించాడు. కానీ.. ఆ అమ్మాయి మాత్రం వేరే వ్యక్తితో ప్రేమాయణం ప్రారంభించింది. ఇది తట్టుకోలేని పిచ్చి ప్రేమికుడు కన్నవాళ్ల గురించి ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు. అసలేం జరిగిందంటే.. ఉప్పల్ రామంతాపూర్ లో అమ్మాయి మోసం చేసింది అని చక్రపాణి అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
Fake Apple Products: ఐ ఫోన్...! ఇది మొబైల్ ఫోన్ కాదు... ఓ స్టేటస్ సింబల్ !! లక్ష రూపాయల విలువైన వేరే మోడల్ ఫోన్ వాడుతున్నా... 50 వేల ఐ ఫోన్ ఉంటేనే గొప్ప !! కనీసం చేతికి యాపిల్ వాచ్ ఐనా ఉండాలి.. అని ఫీల్ అయ్యే వారినే టార్గెట్ చేసిందో ముఠా.
Tragedy : హైదరాబాద్ నగరంలోని మియాపూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి విద్యార్థిని హన్సిక (14) ఆత్మహత్యకు పాల్పడి కుటుంబ సభ్యులు, స్నేహితులను మృదువుగా కలిచివేసింది. ఈ ఘటన మియాపూర్‌లోని జనప్రియ అపార్ట్‌మెంట్స్‌లో జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, హన్సిక ఒక ప్రైవేట్ పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. గురువారం సాయంత్రం సమయంలో ఆ బాలిక అపార్ట్మెంట్ భవనం పై నుండి దూకింది. Luxury Cars Tax Penalty: అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్…
Physical Harassment : రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర ఘటన వెలుగుచూసింది. దివ్యాంగురాలైన చెవిటి, మూగ యువతిపై స్థానిక యువకుడు అత్యాచారం చేసి, తరచూ వేధింపులకు గురిచేశాడు. చివరికి మానసిక వేదన తట్టుకోలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కుటుంబం జీవనోపాధి కోసం హైదరాబాద్ ఆల్మాస్గూడలో నివాసం ఉంటోంది. ఆ…
మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో పబ్ యజమానులకు చుక్కెదురైంది. ఈగల్ టీం మూడు పబ్బుల యజమానులపైన కేసులు నమోదు చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా ఈగల్ టీం గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు బట్టబయలైంది.
కంటే కూతుర్నే కనాలి అంటారు. చివరి దశలో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటుందని ఇలా చెబుతారు. కానీ హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ కూతురు చేసిన పని వింటే.. కంటే ఇలాంటి కూతుర్ను మాత్రం కనొద్దని చెప్పుకుంటారు. తుచ్ఛమైన వివాహేతర బంధం కోసం ఏకంగా కన్న తండ్రినే పొట్టన పెట్టుకుంది ఆ కసాయి కూతురు. ముషీరాబాద్ ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్‌గా పని చేస్తోంది. వీళ్ల కూతురు మనీషాకు…
హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి.. ఒకే రోజు మూడు హత్యలు వెలుగు చూశాయి. మూడు హత్యలూ అనుమానాస్పదమే !! కూకట్‌పల్లిలో బర్త్‌డే పార్టీకని పిలిచి ఓ యువకుడిని హత్య చేయగా... నాగోల్‌లో జూస్ సెంటర్ నిర్వాహకుడిని దారుణంగా హత్య చేశారు. బహదూర్‌పురలో ఓ యువకుడిని హతమార్చారు గుర్తుతెలియని వ్యక్తులు. వరుస హత్యలకు కారణమేంటి..? మూడు హత్యల్లో దాగున్న మిస్టరీ ఏంటి...?
వ్యాపారం ప్రమోషన్ కోసం తమ నెంబర్లను సోషల్ మీడియాతో పాటు ఎక్కడపడితే అక్కడ పెడితే ఇబ్బందులు ఎదుర్కొక తప్పవు.. ఒక వ్యాపారవేత్తకు ఇదే అనుభవం ఎదురయింది.. వ్యాపారవేత్తకు ఫోన్ చేసి వ్యాపార విషయాలు అడిగి చివరకు తక్కువ ధరికే బంగారం ఇప్పిస్తామని చెప్పి కోటి రూపాయలను కొట్టేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన ఓ రియల్టర్ వ్యాపారాభివృద్ధి కోసం తన పేరు, ఫోన్ నెంబర్ కార్యాలయంపై రాసుకోవడమే శాపమైంది. అలా లభించిన ఫోన్ నెంబర్ ఆధారంగా…
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఓ ఓయో హోటల్లో బ్యూటిషన్ అనూష అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆత్మహత్యగా భావించిన హోటల్ సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అనూష తల్లిదండ్రులు... ఆత్మహత్య కాదని.. ఆమెకు అలాంటి ఆలోచనలు లేవని.. కచ్చితంగా ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.