Hyderabad: ఎనిమిదేళ్లు ప్రేమించుకున్నారు. ఇక్కడ అబ్బాయి సీరియస్‌గానే ప్రేమించాడు. కానీ.. ఆ అమ్మాయి మాత్రం వేరే వ్యక్తితో ప్రేమాయణం ప్రారంభించింది. ఇది తట్టుకోలేని పిచ్చి ప్రేమికుడు కన్నవాళ్ల గురించి ఒక్కక్షణం కూడా ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు. అసలేం జరిగిందంటే.. ఉప్పల్ రామంతాపూర్ లో అమ్మాయి మోసం చేసింది అని చక్రపాణి అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లెటర్ రాసి ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. పిర్జాదిగూడాకి చెందిన ఓ యువతితో గత ఎనిమిదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. క్రమేణా ఆ యువతి చక్రపాణిని దూరం చేస్తూ వచ్చింది.
READ MORE: Perni Nani: కొడుకు కోసమే చంద్రబాబు తపన.. జగన్ అడ్డంకి లేకుండా చేస్తున్నారు!
ఆమె ఇప్పుడు వేరే వ్యక్తితో ప్రేమలో పడింది. నువ్వు నాకు వద్దు అని చక్రపాణితో చెప్పింది. దీంతో మనస్థాపానికి గురైన చక్రపాణి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడి తల్లిదండ్రులు ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆ యువతిని లవ్ చేయమని వేధిస్తున్నాడని గతంలో చక్రపాణిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఆమె తల్లి తండ్రులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అప్పుడు ఆ అమ్మాయి మైనర్ కావడంతో అతడిని జైలుకు పంపారు. ఇప్పుడే అదే అమ్మాయి చక్రపాణిని మోసం చేసింది. ఇప్పుడు ఆమెను శిక్షించేందుకు చట్టాలు ఏమీ లేవా? అంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Jagtial District: 10 గుంటల భూమి కోసం ఘాతుకం.. తండ్రిని కత్తితో పొడిచిన తనయుడు…