హైదరాబాద్ నగరంలోకి బంగ్లాదేశ్ వాసులు భారీగా చొరబడ్డారు. హైదరాబాద్, సైబరాబాద్ శివారు ప్రాంతాల్లో అక్రమ వలసదారులు భారీ సంఖ్యలో నివసిస్తున్నారు. హైదరాబాద్‌లోకి అక్రమంగా వచ్చిన వారిని పోలీసులు గుర్తిస్తున్నారు. ఇప్పటికే 20 మంది అక్రమ బంగ్లాదేశ్ వలస దారులను పోలీసులు పట్టుకున్నారు. 20 మంది బంగ్లాదేశ్ వాసులను పట్టుకొని.. భారత సరిహద్దు ప్రాంతంలో ఉన్న బీఎస్‌ఎఫ్‌కు తెలంగాణ పోలీసులు అప్పగించారు.
Also Read: Crime News: మైలపోలు తీస్తుండగా పెళ్లి ఆపిన పోలీసులు.. ఆఖరి నిముషంలో ఏం జరిగిందంటే?
హైదరాబాద్ నగరంలో ఇదివరకే పలుమార్లు బంగ్లాదేశీయులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎప్పటికప్పుడు అక్రమ వలసదారులను బీఎస్‌ఎఫ్‌కు అప్పగిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు దేశవ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. గతేడాది బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో భారతదేశంకు అక్రమ వలసలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోకి వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకుంటున్నారు.