Hyderabad: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ అమానుషంగా వ్యవహరించింది. విసిగిస్తున్నారని ఓ విద్యార్థిని చితకబాదింది. ఈ ఘటన తాజాగా హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. హైదరాబాద్ ఎల్బీనగర్ మన్సురాబాద్ లోని బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండవ తరగతి చదువుతున్న విద్యార్థిపై టీచర్ దాడి చేసింది.