బీజేపీకి డిపాజిట్ రాకుండా చేయాలి : మంత్రి హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా వీణవంకలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… మీ సహకారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇద్దాం. వీణవంకలో 2-3 రోజుల్లో 24/7 పనిచేసేలా ఆస్పత్రి, పోస్ట్ మార్టం కేంద్రం మంజూరుకు కృషి చేస్తా. బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, వివేక్, సంజయ్ ఇక్కడి వాళ్లా… అసహనంతో ఈటెల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బీజేపీ ప్రభుత్వంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చింది అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది. బీజేపీ అమ్మకానికి.. టీఆర్ఎస్ నమ్మకానికి మరో రూపం. చావు నోట్లో తలపెట్టి ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్. 24 గంటల కరెంటు ఇస్తామంటే కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఇవాళ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్నామ్. కాళేశ్వరం పూర్తవుతదా అన్నారు.. రైతులు వద్దనే రీతిలో నీళ్లు వస్తున్నాయి. నీటి తీరువా రద్దు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు.
Read Also : దళిత బంధు కోసం మరో 500 కోట్లు విడుదల…
Also Read
- Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
- Bus Fire Accident: ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. పూర్తిగా దగ్ధమైన ఆర్టీసీ బస్సు.!
ఇక రైతులకు ఏ కష్టం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయానికి విద్యుత్ మీటర్లు పెడతామంటోంది. రైళ్లు, రోడ్లు అమ్మితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది. సీఎం కేసీఆర్ రైతు బంధు ఇస్తుంటే.. కేంద్రం ధరలు పెంచుతూ రైతుల నడ్డి విరుస్తోంది. ఈటలకు రైతుల పట్ల ప్రేమ ఉంటే యాసంగి లో ఎన్ని వడ్లు పండినా కొంటామని ఒప్పించాలి. ఈటల తన బాధను ప్రపంచ బాధగా చిత్రీకరిస్తున్నాడు. ప్రజల కష్టం తన కష్టంగా భావించే గొప్ప నేత సీఎం కేసీఆర్ అన్నారు. మేనిఫెస్టోలో పెట్టకున్నా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మీ అందిస్తున్నాము. గెల్లు శ్రీనివాస్ యాదవ్ పనిచేయించగలిగిన నాయకుడు. ఆనాడు ప్రజల కోసం కేసీఆర్ రాజీనామా చేసాడు.. ఈటెల రాజేందర్ ఎందుకు రాజీనామా చేసాడో చెప్పాలి. ప్రజలు బాగుపడలా.. ఈటల బాగుపడలా ఆలోచించండి అని సూచించారు హరీష్ రావు.
హుజురాబాద్ కు మీరు కూడా వెయ్యి కోట్లు తెచ్చి ఓట్లు అడగండి. బీజేపీ చేసిన మంచి పని ఏందో చెప్పాలి. కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదు. రైతులను బాగు చేసిన టీఆర్ఎస్ కు ఓటేద్దామా.. రైతు నడ్డి విరిచిన బీజేపీకి ఓటేద్దామా ఆలోచించాలి. పోటీ టీఆర్ఎస్, బీజేపీకి మధ్య జరుతోంది. ఎవరు గెలిస్తే లాభం జరుగుతుందో ఆలోచించాలి. మీ చరిత్రలో నీళ్లు, కరెంటు కోసం బాధ పడే రోజులు ఉండవు. ఈటల గడియారాలు, కుట్టు మిషన్లు, కుంకుమ భరిణలను నమ్ముకుంటే.. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని నమ్ముకుంది. టీఆర్ఎస్ కష్టాల్లో తోడుగా ఉన్నాం.. ఆపద మొక్కులు మొక్కే వాళ్ళం కాదు. ఏడేళ్లు మంత్రిగా ఉండి చేయని అభివృద్ధి.. ఈటెల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి చేస్తాడా… గడప గడపకు వెళ్లి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లండి. బీజేపీ నేతలు ఇక్కడ తీర్ధ యాత్రలు కాదు.. ఢిల్లీకి యాత్ర చేయాలి. కేంద్రం 6 లక్షల కోట్లను కుదువు పెట్టే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ వ్యవస్థను కూలదొస్తోంది.. కుదువు బెడుతోంది. వ్యవస్థను కూలదోసే వాళ్ళ వైపు ఉందామా.. వ్యవస్థను నిలబెట్టే వాళ్ళ వైపు ఉందామా… గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు విషయంలో ఎలాంటి సందేహం లేదు. హుజురాబాద్ టీఆర్ఎస్ గడ్డ. ఈటల రాక ముందు ఈ గడ్డపై గులాబీ జెండా ఎగిరింది.. ఎప్పుడు కూడా ఎగురుతుంది. బీజేపీకి డిపాజిట్ రాకుండా చేయాలి అన్నారు. బీజేపీ ఏం చెప్పి హుజురాబాద్ ప్రజలను ఓటు అడుగుతది. హుజురాబాద్ కు బీజేపీ ఏం చేసింది. బండి సంజయ్ వీణవంకలోని ఏ గ్రామలోనైనా 10 లక్షలైనా ఖర్చు చేశాడా… దత్తత తీసుకున్న రామకృష్ణపూర్ కు బండి సంజయ్ రూపాయి పని చేయలేదు. ఢిల్లీ బీజేపీ వాళ్ళు వచ్చినా ఏం చేయలేరు అని పేర్కొన్నారు మంత్రి హరీష్ రావు.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
-
Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? ‘ప్యారడైజ్’ బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
-
Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!