హుజురాబాద్ ఉపఎన్నికను కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంటుందా? ఇంకా గ్రౌండ్‌లోకి ఎందుకు ఎంట్రీ ఇవ్వలేదు? పరువుకు ప్రాధాన్యం ఇచ్చి.. ఫలితం గాలికి వదిలేసిందా? ఇంకా మొదలు కాని కాంగ్రెస్ ప్రచారం..! హుజురాబాద్ ఉపఎన్నికపై తెలంగాణ కాంగ్రెస్ మొదటి నుంచి నాన్ సీరియస్సే. గాంధీభవన్‌లో ఉపఎన్నిక సందడే లేదు. అసలు రాష్ట్రంలో ఒక ఉపఎన్నిక జరుగుతుందనే సోయి పార్టీ నేతల్లో ఉందో లేదో అనే డౌట్ కేడర్‌ది. మాజీ మంత్రి కొండా సురేఖను బరిలో దించాలని భావించి భంగపడింది. ఆమె…
హుజురాబాద్ ఉప ఎన్నికలు సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది… గతంలో హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు పెరిగినా.. నేను, నా భార్య మా పదవులకు రాజీనామా చేస్తామని.. దీనికి నువ్వు సిద్ధమా? అంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్ విసిరారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. అయితే, గండ్ర వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ…
కొత్త పీసీసీ చీఫ్, కొత్త కమిటీలను నియమించిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. అలా అనీ మొత్తం కార్యక్రమాలకు దూరంగా ఉండడం లేదు.. ఆయన నియోజకవర్గం, ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ, పార్టీ సమావేశాలకు, సభలకు దూరంగా ఉంటున్నారు. ఇక, అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ నాయకత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న కోమటిరెడ్డి.. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. అసలు తాను…
హుషారుగా మాజీ మంత్రి ఈటలతో పాటు విమానం ఎక్కి.. ఢిల్లీలో బీజేపీ చేరిన నేతలు.. ఇప్పుడు మళ్లీ కమలం పార్టీకి బైబై చెబుతున్నారు.. తాజాగా, ఈటల ప్రధాన అనుచరుడిగా పేరున్న టి.స్కాబ్ వైస్ చైర్మన్ పింగళి రమేష్.. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరినా.. మేం ఆ పార్టీలో ఇమడలేకపోతున్నాం అన్నారు.. అందుకే…
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది.. ఆయనకు ప్రధాన అనుచరులుగా ఉన్న పింగిలి రమేష్, చుక్కా రంజిత్.. ఆయనకు గుడ్‌బై చెప్పేశారు.. వీరిలో పింగిలి రమేష్ సింగిల్ విండో వైస్ చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఓవైపు హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు ఈటల రాజేందర్.. తన పాత అనుచరులతో కపులుపుకుని.. బీజేపీ శ్రేణులతో మమేకం అవుతూ ముందుకు సాగుతున్నారు.. కానీ, అప్పుడప్పుడు కొందరు ఈటలకు షాక్…
హుజురాబాద్ ఉప ఎన్నికపై టీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఉప ఎన్నికలు టీఆర్ఎస్‌కు కొత్త కానప్పటికీ …హుజురాబాద్ బై ఎలక్షన్ ను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అన్ని పార్టీల కంటే ముందే మండలాల వారీగా ఇంఛార్జిలను నియమించి.. వారిని రంగంలోకి దింపింది. ఉప ఎన్నిక బాధ్యతను మంత్రి హరీష్ రావు, బోయినపల్లి వినోద్ కుమార్ లకు అప్పగించారు గులాబీ పార్టీ బాస్, సీఎం కేసీఆర్. ఇటు కేసీఆర్ స్వయంగా ఎప్పటికప్పుడు హుజురాబాద్ లోని రాజకీయ పరిస్థితులపై ఆరా…
ఉద్యమకారుడు పోచమల్లును టీఆర్ఎస్ పార్టీలోకి మంత్రి హరీష్ రావు ఆహ్వానించారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ పెట్టిన కష్టాలకు ఈ రోజు పోచమల్లు తెరాసలోకి వచ్చాడన్నారు. ఈ రోజు గెలిచేది న్యాయం, ధర్మం అని.. ఈటల మాటలకు చేతలకు సంబంధం లేదన్నారు. రక్త సంబంధం కంటే మానవ సంబంధం గొప్పదన్న ఈటల, ఈరోజు మత్తతత్వ పార్టీలో చేరిండని హరీష్ రావు కామెంట్స్ చేశారు. తల కిందికి కాళ్లుపైకి పెట్టిన ఈటల గెలవడని మంత్రి…
హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేకపోయినా.. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది దూకుడు పెంచింది. మరోవైపు.. బీజేపీ అధికారికంగా అభ్యర్థిని ప్రకటించకపోయినా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రజలతో మమేకం అవుతున్నారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ కూడా తన అభ్యర్థి ఎంపికపై ఫోకస్ పెట్టింది… హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పేరు దాదాపు ఖరారు అయినట్టు ప్రచారం సాగుతోంది.. ఉప ఎన్నికలో మాజీ మంత్రి కొండా సురేఖను…
ఉప ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రాకముందే.. హుజురాబాద్‌లో పొలిటికల్ హీట్ మాత్రం పెరుగుతూనే ఉంది… అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్.. మళ్లీ ట్రాక్‌లో వచ్చారు.. ఇవాళ.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు… ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా.. నా గెలుపును ఎవ్వరూ ఆపలేరనే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. వస్తవా.. రా..! హరీష్‌రావు ఇక్కడ పోటీ చేద్దాం.. వస్తావా..? రా..…
కుట్రలకు కేరాఫ్ కేసీఆర్ అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్… జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నడూ లేని పద్ధతిలో అనేక వర్గాల ప్రజలపై కొత్తగా సీఎంకు ప్రేమ పుట్టుకు వస్తుందని సెటైర్లు వేశారు.. పేదలకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించాలని కోరాను.. విద్య విషయంలో కొంత పురోగతి ఉన్న వైద్యం విషయంలో లేదన్నారు.. అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని.. నాలాంటి వారికి పేరు వస్తుందని పట్టించుకున్న పాపాన…