హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి పీక్‌కి చేరింది. ఈ నెల 27తో ప్రచార పర్వానికి ఎండ్ కార్డు పడనుంది. ఎంత ప్రచారం చేసినా ఇంకో నాలుగు రోజులే. దీంతో ప్రధాన పార్టీలకు చెందిన ప్రముఖులు నియోజకవర్గంలోని ఐదు మండలాలను సుడిగాలిలా చుట్టేస్తున్నారు. హుజూరాబాద్ పట్టణం మొదలుకుని మారుమూల పల్లెలల వరకు ..వీధి వీధిన ..గల్లీ గల్లీలో ప్రచార హోరు వినిపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు రోడ్ షోలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. రెండు చేతులు జోడించి…