తెలంగాణలో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది.. అన్న విషయంలో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న బద్వేల్ నియోజకవర్గంతో కలిపి.. దీపావళి తర్వాతే ఈ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న స్పష్టతను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఇచ్చేసింది. ఏపీలో చూస్తే.. పోటీ స్పష్టంగా కనిపిస్తోంది. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అన్నట్టుగానే ఉంది. హుజురాబాద్ విషయానికి వస్తే.. ఇక్కడ చతుర్ముఖ పోటీ స్పష్టంగా కనిపిస్తోంది.…
హుజూరాబాద్ ఉప ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్నా కొద్దీ నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. అన్ని పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నేతలంతా వీరలెవల్లో ఫార్మామెన్స్ చేసేస్తున్నారు. ఎవరికీ వారు తగ్గెదేలే అన్నట్లుగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండటంతో నేతల మధ్య కుదుర్చుకున్న ఒప్పందాలు సైతం బహిర్గతం అవుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ లో చేరిన నేత కౌశిక్ రెడ్డి.. బీజేపీ నేత ఈటల రాజేందర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేయడం…
దేశంలో ఏ పార్టీకిలేని ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. స్వాతంత్ర్య భారతదేశాన్ని అత్యధిక కాలం పరిపాలించింది కూడా కాంగ్రెస్సే. ఆ పార్టీకి అధికారంలోకి రావడం.. రాకపోవడం కొత్తేమీకాదు. అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కోంటోంది. వరుసగా రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో ఆ ప్రభావం రాష్ట్రాలపైన పడుతోంది. దీంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కాంగ్రెస్ గెలిచిన తీరాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కాంగ్రెస్ రాబోయే ఎన్నికలను ఛాలెంజ్ గా…
సీఎం కేసీఆర్ వ్యూహాలు ఎవరికీ ఓ పట్టాన అర్థం కావన్నది పొలిటికల్ సర్కిల్స్ లో తరచూ వినిపించే మాట… ప్రత్యర్థులు వాటిని అర్థం చేసుకునే లోపే ఆయన తన పని చక్కబెట్టుకోగల నేర్పరి. ఎంతో ముందుచూపుతో ఆయన వ్యూహాలు ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్నా తనకు ఏమాత్రం ఫరక్ రాకుండా చూసుకోవడం కేసీఆర్ దిట్ట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన రచించిన వ్యూహాలు సత్ఫలితాలిచ్చాయి. తెలంగాణ ప్రజలందరీలో ఉద్యమ…
సిద్దిపేట : ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ పోలి లక్ష్మణ్ ముదిరాజ్ మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత నిచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని.. మత్స్య కారులకు దేశంలో ఏ ప్రభుత్వం లేనంత అండగా టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్య కారుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు…
తెలంగాణ వేదికగా హుజూరాబాద్ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఉప ఎన్నికకు కారణమైన మాజీ మంత్రి ఈటల రాజేందర్.. బీజేపీ అభ్యర్థిగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. పోటీగా.. అధికార టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. పోటాపోటీ వాడీవేడీ ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో.. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేక మల్లగుల్లాలు పడుతోంది. కొన్నాళ్లపాటు కొండా సురేఖ పేరు బలంగానే వినిపించింది. కానీ.. ఆమె సుముఖంగా ఉన్నారా లేదా.. అన్నది కూడా సరైన స్పష్టత రాకుండా…
కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ కు డబుల్ దమాకా అని… గెల్లు శ్రీనివాస్ ఎమ్మెల్యే, కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇక హుజురాబాద్ కు డోక లేదని మంత్రి హరీష్ రావు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, బిజెపికి మధ్యే పోటీ ఉంటుందన్నారు. ఇవాళ హుజురాబాద్ నియోజక వర్గంలో పర్యటించిన ఈ సందర్భంగా మాట్లాడుతూ… రైతు బంధుకు, రైతు ద్రోహులకు మధ్య పోటీ అని తాను అంటున్నానని తెలిపారు. మార్కెట్ యార్డులు రద్దు,…
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం హుజురాబాద్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు బీసీ మంత్రం ప్రయోగిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా బీసీ కార్డునే ప్రయోగించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ బరిలో దించనున్నట్టు సమాచారం. అక్కడ ఉన్న ఓటు బ్యాంక్.. సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని సురేఖను వ్యూహాత్మకంగా బరిలో దింపుతున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఇప్పటి వరకు ఇంకా ఆమె ను కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేయలేదు. ఈ నేపథ్యం లో కాంగ్రెస్ పార్టీ మరో…
ఉపఎన్నిక వేడి నెలకొన్న హుజురాబాద్‌లో అన్ని పార్టీల నేతలను ఓ అంశం భయపెడుతోంది. ఎటు నుంచి ఎటు ఏ ముప్పు వాటిల్లుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఫోన్ కాల్ వస్తే చాలు ఉలిక్కిపడుతున్నారట. ఫోన్ రింగ్ వినిపిస్తే.. గుండెల్లో దడ పెరుగుతోందట. ఎందుకో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ఫోన్ వస్తే మాట్లాడటానికి జంకుతున్న హుజురాబాద్ నేతలు! చేతిలో ఫోన్ ఉంది కదా అని ఎడా పెడా మాట్లాడేస్తే.. ఆ కాల్ రికార్డింగ్‌లు బయటకొచ్చి నేతలను చిక్కుల్లో…
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ పరిస్థితులపై ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యం లోనే మంగళవారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం పై చర్చించనున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర శాఖల పునర్నిర్మాణం, అందుకోసం తేదీల ఖరారు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. దళితబంధు…