టీఆర్ఎస్ పార్టీలో జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. దీంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. హూజూరాబాద్ ఉప ఎన్నికను ఈటల రాజేందర్ తోపాటు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ పొలిటికల్ హీట్ మొదలైంది. కాంగ్రెస్ సైతం హుజురాబాద్ వేదికగా తమ సత్తా చూపించేందుకు రెడీ అవుతుంది. ఈ ఎన్నిక ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి.…
తెలంగాణ కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చాక పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇక ఇప్పటి వరకు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ అనుకుంటున్న తరుణలో ఆ ప్లేసును కాంగ్రెస్ భర్తీ చేస్తుందని ఆ పార్టీ పెద్దలు ధీమాగా ఉన్నారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నికకు వచ్చేసరికి కనీసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఇక్కడి ఉప ఎన్నికకు ఇంకా సమయం ఉన్నా టీఆర్ఎస్, బీజేపీలు తమ…
తెలంగాణ కాంగ్రెస్ ని ఆమె ఇరుకున పెట్టేశారా..? హుజూరాబాద్ అభ్యర్థి కోసం వెతుకుతున్న సమయంలో… ఆ మహిళా నేత కామెంట్స్ పార్టీని మరింత గందరగోళం లోకి నెట్టాయా..? ఇప్పుడు హుజూరాబాద్, తర్వాత వరంగల్ అంటున్నారట. ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ ఏదో అనుకుంటే మరేదో జరిగిందా? తెలంగాణ కాంగ్రెస్ హుజూరాబాద్ అభ్యర్ధి ఎంపిక పై పెద్దగా తర్జనభర్జనలు పడలేదు. కానీ, బలమైన అభ్యర్దిని బరిలోకి దించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా నే బీసీ సామాజిక వర్గం…
హుజురాబాద్‌లో ఉపఎన్నిక ప్రచారం హోరెత్తుతున్న సమయంలో.. అదో చిన్న ఉపఎన్నిక అని కేటీఆర్ ఎందుకన్నారు? లోకల్ లీడర్లే అంతా చూసుకుంటారన్న ఆయన మాటల వెనక మతలబు ఏంటి? పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న విశ్లేషణేంటి? లెట్స్ వాచ్! హజురాబాద్ ఉపఎన్నిక మీద కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఆసక్తి! హుజురాబాద్‌లో గెలుపే లక్ష్యంగా రెండు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది అధికార పార్టీ టీఆర్ఎస్. మంత్రి హరీష్‌రావు బాధ్యతలు తీసుకుని పార్టీని గేరప్ చేస్తున్నారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలు.. పార్టీ…
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో.. వరంగల్ జిల్లాలో కొండా సురేఖ కుటుంబం.. రాజకీయంగా మంచి ప్రాధాన్యత పొందింది. తర్వాత టీఆర్ఎస్ లోకి రావడం.. చివరికి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరడం.. ఇలా ఐదారేళ్లుగా వారి రాజకీయం చుక్కాని లేని నావలా ముందుకు పోతోంది. ఇలాంటి తరుణంలో.. హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో వారిని ఓ అవకాశం తలుపు తట్టి మరీ పిలుస్తోంది. ఈ విషయమై.. కొండా సురేఖ కుటుంబం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గతంలో జరిగిన పొరబాట్లు, రాజకీయంగా చేసిన…
తెలంగాణలోని హుజూరాబాద్ లో తప్ప రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి ఎన్నికలు లేవు. ఈ ఒక్క ఉప ఎన్నికనే రాబోయే సార్వత్రిక ఎన్నికలను డిసైడ్ చేయనుందని ప్రచారం జరుగుతోంది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా హుజూరాబాద్ లో రాజకీయవేడి రాజుకుంది. ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే ఇక్కడ అన్ని పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. త్వరలోనే ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తుందని అందరూ…
హూజూరాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణలో ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెల్సిందే. ఈటల రాజేందర్ ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తుండగా ఆయన వేవ్ కొనసాగుతోంది. అయితే ఈటలను ఎలాగైనా హుజూరాబాద్లో ఓడించాలని సీఎం కేసీఆర్ పకడ్బంధీగా పావులు కదుపుతున్నారు. దీంతో ఈటెల వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా పోటీ మారిపోయింది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లురుతోంది. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎదుర్కొనే మొదటి…
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ శిబిరాన్ని మాత్రం టెన్షన్ పెడుతోందా? హజురాబాద్ ఉపఎన్నికపై పడే ప్రతికూల ప్రభావంపై లెక్కలు వేస్తున్నారా? బీజేపీలో చేరేముందే ఏ అంశంపై అయితే ఈటల స్పష్టత కోరారో.. ఇప్పుడు అదే మళ్లీ చర్చకు వస్తోందా? సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ చూపించే ప్రభావంపై ఈటల వర్గం ఆరా? అదిగో.. ఇదిగో తేదీ ప్రకటించేస్తారని అనుకుంటున్న వేళ హుజురాబాద్ ఉపఎన్నికపై కేంద్ర…
హుజూరాబాద్ బై పోల్…..తెలంగాణలో హైవోల్టేజీ ఎలక్షన్. ఈ నెలలోనే అనుకున్నారంతా. షెడ్యూల్ రేపో మాపో అన్నారు. ఇంకేముంది ..అధికార పార్టీతో సహా అన్ని రాజకీయపక్షాల్లో చెప్పలేనంత హడావుడి. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. భారీ ర్యాలీలు, సభలు.. పంచ్ డైలాగులు. దాంతో పొలిటికల్ హీట్ పీక్ కి చేరింది. కానీ అంతలోనే పెద్ద షాక్. ఎన్నికలు ఇప్పట్లో లేవంటూ ఈసీ అనౌన్స్‌మెంట్. దాంతో నేతల ఉరిమే ఉత్సాహం కాస్తా చల్లబడింది. ఈటల రాజేందర్ వ్యవహారం మొదలై దాదాపు ఐదు నెలలవుతోంది.…