హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా అన్ని పార్టీలు భావించాయి. నేడో రేపో ఉప ఎన్నికలు ఉంటాయని అందరూ ఉత్కంఠగా ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ఈసీ బాంబు పేల్చింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల బైపోల్ ఇప్పట్లో లేదని కేంద్ర ఎన్నికల సంఘం తేల్చిచెప్పడంతో అంతా ఊసురుమంటున్నారు. మరోవైపు ఉప ఎన్నిక వాయిదా ఏ పార్టీకి కలిసి వస్తుంది? ఇంకేవరికీ మైనస్ అవుతుందనే చర్చ తెలంగాణలో జోరుగా సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికను…