కేరళలోని వయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని కొండ ప్రాంతాలలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు కారణంగా ఇప్పటివరకు 122 మంది చనిపోయారు. అలాగే 142 తీవ్రగాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం అధికారులు కాపాడారు.
వయనాడ్‌లో రుతుపవన వర్షాల కారణంగా సంభవించిన పలు కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకూ దాదాపు 88 మంది మరణించారు. 116 మంది తీవ్ర గాయాలతో ఉన్న వారిని రెస్క్యూ టీం కాపాడారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం జూలై 30, 31న రెండు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాలు, వేడుకలను వాయిదా వేసింది.
భారీ వర్షాల మధ్య కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 70 మంది మరణించారు. అంతేకాకుండా.. 116 మంది గాయపడ్డారు. కొండచరియల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. ప్రజలను రక్షించేందుకు భారీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.