రేపు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్-బంగ్లా మూడో టీ20 మ్యాచ్ కోసం.. పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు ఉన్నారు. అలాగే.. 1,662 మంది లా అండ్ ఆర్డర్, 14 ప్లాటూన్ల టీఎస్‌ఎస్పీ, 6 ప్లాటూన్ల సాయుధ దళాలు బందోబస్తు ఉన్నారు.
ప్రధాని మోడీ ఈ నెల 26న హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో.. ప్రధాని మోడీ టూర్ సందర్భంగా హైదరాబాద్‌లో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు రానున్నారు ప్రధాని మోదీ. ఐఎస్‌బీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. జరిగే వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. తొలిసారి ఐఎస్‌బీ మొహాలితో కలిసి ఐఎస్‌బీ హైదరాబాద్ సంయుక్త గ్రాడ్యూయేషన్ సెరిమనీ ఏర్పాటు చేసింది. 2022 పోస్ట్…