Viral Video: హౌతీ ఉగ్రవాదులు ఆదివారం రోజు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సై్ల్‌తో దాడి చేశారు. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపైకి మిస్సైల్‌ని ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.