ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది.. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. నేడు అధికారులతో రెవెన్యూ శాఖ సమీక్ష సమావేశంలో నిర్వహించారు సీఎం చంద్రబాబు.. ఈ సందర్భంగా ఆదేశించారు.. ఇందు కోసం ముగ్గురు మంత్రులతో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి, పొంగూరు నారాయణతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమి ఇళ్ల స్థలాల కోసం ఇస్తామని తెలిపారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు పని చేస్తున్నారని తెలిపారు.. 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు..
Parigi : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ అధికారుల చర్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల క్రితం తుంకులగడ్డ ప్రాంతంలో ప్రభుత్వంచే కేటాయించిన ఇళ్ల స్థలంలో లబ్ధిదారుడు ఇల్లు నిర్మించేందుకు బునాది గోడలు నిర్మిస్తుండగా, పరిగి తహసీల్దారు జేసీబీతో వచ్చి వాటిని ధ్వంసం చేశారు. అంతేకాదు, ఈ ఘటనను వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తి సెల్‌ఫోన్‌ను లాక్కొనడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై స్థానికులు అధికారుల తీరును తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. 2002లో సర్వే నంబర్ 530లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు జర్నలిస్టు సంఘం నాయకులు, సీనియర్ జర్నలిస్టులు.. ఇటీవల జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు కేటాయిస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందకు క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.