Kangana Ranaut: నటి కంగనా రనౌత్ ఇజ్రాయిల్‌కి మద్దతు తెలిపారు. బుధవారం ఆమె భారత్ లోని ఇజ్రాయిల్ రాయబారి నవోల్ గిలోన్‌ని కలిశారు. ఇద్దరు పలు విషయాలను చర్చించుకున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించిన విషయాలను ఇరువురు తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఉగ్రవాదంపై ఇజ్రాయిల్ విజయం సాధింస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.