Tamil Nadu : తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి మృతి చెందిన వారి సంఖ్య 63కి చేరింది. జూన్ 18న రాష్ట్రంలోని కరుణాపురం గ్రామంలో జరిగిన ఈ దుర్ఘటన తర్వాత కల్తీ మద్యం తాగి 225 మంది వివిధ ఆసుపత్రుల్లో చేరారు.
తమిళనాడు రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. తాజాగా మరణాల సంఖ్య 58కు చేరింది. మరోవైపు.. రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో 156 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 110 మంది కళ్లకురిచి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Punjab: పంజాబ్ రాష్ట్రంలో కలుషిత మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. సంగ్రూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపేందుకు పంజాబ్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది.
బీహార్‌లో కల్తీ మద్యం కలకలం రేపింది. బీహార్ సీఎం నితీష్ కుమార్ సొంత జిల్లా నలందలో సంక్రాంతి పండగ సందర్భంగా కల్తీ మద్యం తాగి 11 మంది మరణించారు. శనివారం ఆరుగురు మరణించగా… ఆదివారం మరో ఐదుగురు మరణించారు. బీహార్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తుండటం గమనార్హం. 2016 నుంచి బీహార్‌లో మద్యపాన నిషేధం ఉండగా.. గత రెండు నెలల వ్యవధిలోనే కల్తీ మద్యానికి అలవాటు పడి…