Punjab: పంజాబ్ రాష్ట్రంలో కలుషిత మద్యం తాగి మరణించిన వారి సంఖ్య 21కి చేరింది. సంగ్రూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విచారణ జరిపేందుకు పంజాబ్ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. సంగ్రూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రకారం.. ఇథనాల్ కలిపిన నకిలీ మద్యం తాగా ఇప్పటివరకు 40 మంది ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు. బుధవారం నలుగురు వ్యక్తులు నకిలీ మద్యం తాగి మరణించారు. చాలా మంది ఆస్పత్రి పాలయ్యారు. మరుసటి రోజు పాటియాలోని రాజింద్ర ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. శుక్రవారం మరో 8 మంది మరణించారు. మరసటి రోజు ఐదుగురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 21కి చేరింది.
Read Also: Cash-For-Query Case: తృణమూల్ నేత మహువా మోయిత్రా ఇంటిలో సీబీఐ సోదాలు..
ఈ కేసులో మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఓ ఇంట్లో విషపూరితమైన మద్యం తయారుచేస్తున్నట్లు పట్టుబడిన వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి 200 లీటర్ల ఇథనాల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, దోషులను విడిచిపెట్టమని డీఐజీ హర్చరణ్ సింగ్ భుల్లర్ శుక్రవారం తెలిపారు.