సీఎం జగన్ పాలనపై విపక్ష నేతలు మండిపడుతూనే వున్నారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ పాలనలో మహిళా భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. పోలీస్ యూనిఫాం కోసం మహిళా పోలీసులకు జంట్స్ టైలర్ తో కొలతలు తీయించడం దారుణం అన్నారామె. యూనిఫాం కుట్టేందుకు లేడీ టైలర్స్ లేరా? వైసీపీ పాలనలో మహిళలకే కాదు.. మహిళా పోలీసులకూ రక్షణ కరువైంని అనిత మండిపడ్డారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి, డీజీపీ వల్లే మహిళలకు ఇన్ని అవమానాలు జరుగుతున్నాయన్నారు.…
గుంటూరులో డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ఫారెస్ట్ లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏపీ హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. బ్రాడిపేట లోని క్యాంప్ కార్యక్రమం నుండి వర్చువల్ విధానంలో హోంమంత్రి సుచరిత పాల్గొన్నారు. మియావాకి పద్దతిలో రాష్ట్రంలోని ఎనిమిది బెటాలియన్ లలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సుచరిత ప్రారంభించారు. మంగళగిరి 6వ బెటాలియన్ లో డీజీపీ గౌతం సవాంగ్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు మొక్కలు నాటారు. అన్ని బెటాలియన్ లలోని దాదాపు 15.35 ఎకరాల్లో 19,774 మొక్కలను…
నేరం చేసిన వారెవ్వరిని వదిలి పెట్టబోమని హోం మంత్రి సుచరిత స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుడారు. నేరాలు జరగటం లేదని మేం చెప్పడం లేదు.. నేరం జరిగితే ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో, నిందితులను ఏ విధంగా కఠినంగా శిక్షిస్తుందో చూడాలి. పార్టీ ఏదైనా.. మహిళలపై చేయి వేస్తే ఉపేక్షించే ప్రభుత్వం మాది కాదని సుచరిత అన్నారు. గుంటూరు బాలిక వ్యభిచారం కేసులో 46మందిని అరెస్టు చేశామని సుచరిత అన్నారు. విజవాడలో…
కర్నూలు జిల్లా ఆత్మకూరులో మత విద్వేషాలను రెచ్చగొట్టి, అల్లర్లకు కారణమైన వ్యక్తిని పరామర్శించడానికి ఏకంగా బీజేపీ కేంద్రమంత్రి మురళీధరన్ సబ్ జైల్ కు వెళ్లడం విస్మయానికి గురిచేసిందని హోంమంత్రి సుచరిత అన్నారు. కేంద్ర మంత్రి మురళీధరన్ ఆత్మకూరులో జరిగిన సంఘటనకు సంబంధించిన సమగ్ర వివరాలు తెలుసుకొని ఉంటే బాగుండేదన్నారు. బుడ్డా శ్రీకాంత్ రెడ్డి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని.. మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. గొడవకు ప్రధాన కారకుడు అయ్యాడని పోలీసుల విచారణలో తేలినట్లు హోంమంత్రి సుచరిత గుర్తుచేశారు.…