HMPV Virus: చైనాలో ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (HMPV)’’ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, భారత్‌లో కూడా మూడు కేసులు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు , అహ్మదాబాద్‌లో రెండేళ్ల చిన్నారికి HMPV పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా అప్రమత్తమైంది. ఈ వైరస్ భయాల మధ్య టాప్ మెడికల్ బాడీ-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కీలక ప్రకటన చేసింది. ఈ వైరస్ ఇప్పటికే భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా ‘‘సర్క్యులేషన్’’లో…
చైనాలో గుర్తించిన మరో కొత్త వైరస్ హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటా న్యూమో వైరస్) కి సంబంధించిన కేసులు రాష్ట్రంలో ఎక్కడా లేవని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. పద్మావతి తెలిపారు. ఈ వైరస్ కారణంగా ప్రజలెవరూ భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
చైనాలో హ్యూమన్ మెటాన్యూమోవైరస్ (hMPV) వ్యాప్తిపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ DGHS, NCDC డైరెక్టర్, కేంద్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటనను విడుదల చేసింది. మెటాన్యూమోవైరస్ (hMPV) అనేది ఇతర శ్వాసకోశ వైరస్ లాగానే ఉంటుందని తెలిపింది. ఇది శీతాకాలంలో జలుబు మరియు ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది.. ప్రత్యేకించి యువకులు, వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుందని పేర్కొంది.
HMPV Virus: ‘‘హ్యూమన్ మెటాన్యూమోవైరస్(HMPV)’’ చైనాలో విజృంభిస్తోంది. చైనా వ్యాప్తంగా కోవిడ్ లాంటి పరిస్థితులు ఉన్నట్లు సోషల్ మీడియాలో రిపోర్టులు వెలువడుతున్నాయి. ఆస్పత్రుల మందు జనాలు బారులుతీరిన ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. అయితే, చైనా మాత్రం ఈ పరిణామాలను లైట్ తీసుకుంటోంది. ప్రతీ చలికాలంలో వచ్చే సాధారణ ఇన్ఫెక్షన్‌గా కొట్టిపారేస్తోంది.
కోవిడ్ సృష్టించిన భయోత్పాతాన్ని ఇంత త్వరగా ఎవ్వరూ మర్చిపోలేరు. కోట్లాదిమందిని బలితీసుకున్న ఆ రక్కసి ప్రభావం నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది.తమవారిని కోల్పోయిన కుటుంబాల్లో ఇంకా ఆబాధలు, ఛాయలు పోలేదు కూడా. అలాంటిది ఆ బాధ నుంచే తేరుకోక ముందే చైనా నుంచి మరో కొత్త వైరస్ ఉత్పన్నమైంది. అయితే ఆవిషయాన్ని డ్రాగన్ దేశం.. బయట పెట్టడం లేదు. కోవిడ్ తరహాలోనే దాన్ని గోప్యంగా ఉంచుతోంది.
HMPV Virus: చైనాని కొత్త వైరస్ ‘‘హ్యుమన్‌మోటాన్యూమో వైరస్( HMPV వైరస్)’’ విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనా ఉత్తర ప్రాంతంలో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. ఇప్పటికే చాలా చోట్ల ఆస్పత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు. జ్వరం, గొంతు నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, ఛాతి నొప్పులు ఇలా కోవిడ్-19, ఫ్లూ వంటి లక్షణాలు కొత్త వైరస్ వల్ల కలుగుతున్నాయి. ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. Read Also: Delhi…
కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాలో తాజాగా మరో కొత్త వైరస్ వెలుగు చూసింది.. అంతేకాదు.. వేగంగా వ్యాప్తి చెందుతూ ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది చైనాలో వెలుగు చూసిన హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV)పై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. చైనాలో కొత్త వైరస్ కు సంబంధించి వార్తలు వస్తున్నాయి.. అధికారికంగా ధ్రువీకరణ జరగలేదన్న ఆయన.. ఇలాంటి వైరస్ వస్తే మొదట కేంద్రం స్పందిస్తుందన్నారు.. ఒక వేళ వైరస్ ఉంటే తీసుకోవాల్సిన…