హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓ టూ వీలర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టూ వీలర్ పై వెళ్తున్న ఒకరు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
మహారాష్ట్రలో పూణె హిట్ అండ్ రన్ ఘటనను మరువక ముందే పాల్ఘర్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. స్కార్పియో వాహనం అతి వేగంగా దూసుకురావడంతో సాగర్ గజానన్ పాటిల్ అనే 29 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
ఢిల్లీలోని నోయిడాలో జరిగిన హిట్ అండ్ రన్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోయిడా లోని సెక్టార్ 53 వీధుల్లో పాలు కొనడానికి బయటకు వెళ్లిన ఓ 64 ఏళ్ల వ్యక్తిని గుర్తు తెలియని తెల్లటి కారు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ‘జనక్ దేవ్’ అనే వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. ఇక ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో.. వృద్ధుడు రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న తెల్లటి కారు అవతలి వైపు…
హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ వద్ద ఉన్న దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జిపై తాజాగా హిట్ అండ్ రన్ సంఘటనలో ఇద్దరు యువకలు మృతి చెందారు. ఈ విషయం సంబంధించి హైదరాబాద్ పోలీసులు కాస్త సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం వస్తే మాత్రం కచ్చితంగా జరిమానాలతో పాటు కేసు కూడా నమోదు చేస్తామని పోలీసులు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జి పై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో…
రేపటి నుండి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్ లలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'హిట్ అండ్ రన్' వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుంది.…
Hyderabad: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. రోడ్లపై వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
Madras High Court's Unique Punishment in Drunk And Drive: మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తికి వినూత్న శిక్ష విధించింది మద్రాస్ హైకోర్టు. మద్యం మత్తులో కారు నడుపుతూ.. ముగ్గురు పాదచారులు గాయపడటానికి కారణం అయ్యాడు ఓ వ్యక్తి. అయితే ఆ వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ సరికొత్త రీతిలో శిక్ష విధించారు జస్టిస్ ఏడీ జగదీష్ చంద్రం. మద్యం తాగి వాహనం నడపకూడదని, మద్యానికి వ్యతిరేకంగా చెన్నైలోని సిటీ జంక్షన్ల వద్ద కరపత్రాలు…