హైదరాబాద్ మహానగరంలోని మాదాపూర్ వద్ద ఉన్న దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జిపై తాజాగా హిట్ అండ్ రన్ సంఘటనలో ఇద్దరు యువకలు మృతి చెందారు. ఈ విషయం సంబంధించి హైదరాబాద్ పోలీసులు కాస్త సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీల కోసం వస్తే మాత్రం కచ్చితంగా జరిమానాలతో పాటు కేసు కూడా నమోదు చేస్తామని పోలీసులు జారీ చేశారు. ఈ మధ్యకాలంలో దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జి పై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అనేకమంది కేబుల్ బ్రిడ్జిపై ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.
Also read: Congress: కాసేపట్లో తుక్కుగూడలో కాంగ్రెస్ ‘జనజాతర’ సభ
ముఖ్యంగా యువత కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు, రీల్స్ చేయడం లాంటి వాటికోసం నానా హంగామా క్రియేట్ చేసి చివరికి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. శుక్రవారం రాత్రి బ్రిడ్జిపై సెల్ఫీలు దిగడం కోసం వెళ్ళిన ఓ ఇద్దరి యువకులను అటు పై వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా., మరొకరు చికిత్స పొందుతూ అక్కడ మరణించారు. మృతులను అనిల్, అజయ్ లుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ రాత్రి సమయంలో బ్రిడ్జి ఎలా ఉంటుందన్న విషయంపై అక్కడికి వెళ్లి సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నా సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Also read: Karnataka: కాంగ్రెస్ నేత ఇంట్లోనే “పాకిస్తాన్” ఉంది.. బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..
ఈ సంఘటన అర్ధరాత్రి సమయం 12:30 గంటలకు బ్రిడ్జిపై వేగంగా వస్తున్న ఇన్నోవా కారు., సెల్ఫీలు దిగుతున్న ఇద్దరు యువకులు ఢీకొట్టడంతో జరిగింది. అయితే ప్రమాదం జరిగిన కారు మాత్రం యువకులకు ఏమైందన్నా విషయం కూడా గ్రహించకుండా ఆపకుండా వెళ్ళిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో రికార్డు కావడంతో పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. దీనితో యువకుల మృతదేహాలని ఉస్మానియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎవరైనా సెల్ఫీల కోసం రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని.. కేబుల్ బ్రిడ్జీపై సెల్ఫీలు దిగితే ఫైన్ తోపాటు కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైనా కేబుల్ బ్రిడ్జిపైకి ఫొటోల కోసం వస్తే రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.