Road Accidents: రోడ్డు ప్రమాదాలు..కనిపించని కనీస మానవత్వపు ఛాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరి నిర్లక్ష్యమో రోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ గోల్డెన్ అవర్ అనేది వుంటుందని చాలామందికి తెలీదు. ప్రమాదం జరిగినా.. క్షతగాత్రులను సకాలంలో ఆస్పత్రికి చేరిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చు. కానీ మానవత్వం ఛాయలు కనీసం ఇసుమంతైనా కనిపించడంలేదు. ఈ చిత్రంలో కనిపిస్తున్న యువకుడు పేరు అనుపురం దీపక్.అందరూ ముద్దుగా బన్నీ అని పిలుచుకునే ఒక సామాన్య కుటుంబానికి చెందిన యువకుడు .తండ్రి కులవృత్తి అయిన కల్లు గీసే పనిలో ఉంటూ తాటిచెట్టుపై నుండి పడి కొంత కాలం కిందటే గాయాలపాలయ్యారు.దీంతో కుటుంబ బాధ్యతలను పాలుపంచుకున్నాడు దీపక్… ఈమధ్య ఓ ప్రైవేటు సంస్థలో కరీంనగర్ పట్టణంలో ఉద్యోగంలో చేరిన దీపక్ తన సొంత ఊరిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి డ్యూటీలో చేరడానికి తెల్లవారుజామున కరీంనగర్ కి సోమవారం ఉదయం వెళ్తున్నాడు.
కరీంనగర్ – జగిత్యాల హైవేపై వెళుతున్న క్రమంలో రాంగ్ రూట్ లో వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టింది .తీవ్రగాయాలైన దీపక్ అక్కడే పడిపోయాడు. కనీసం లేవలేని పరిస్థితిలో అచేతనంగా ఉండిపోయాడు. అయితే సదరు ఢీకొట్టిన వ్యక్తి తన వాహనాన్ని ఏ మాత్రం ఆపకుండా అక్కడి నుండి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో చాలా సమయం పాటు స్పృహలోకి రాలేని దీపక్ తన ప్రాణాలు విడిచాడు. ఎన్నో కలలతో భవిష్యత్తు చూడాలనుకున్న ఒక్కగానొక్క కుమారుడు అర్ధాంతరంగా విగతజీవిగా పడి ఉండడం అతని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. సున్నిత మనస్కుడిగా …. అందరితో కలుపుగోలుగా ఉండే దీపక్ మరణం పట్ల బంధుమిత్రులు తీవ్రంగా రోదించారు. విషయం తెలిసిన వెంటనే అతని స్నేహితులు కరీంనగర్ ప్రధాన ఆస్పత్రి కి చేరుకొని స్నేహితుడి పార్ధివ దేహాన్ని చూసి రోదించడం పలువురిని కలిచివేసింది.
Also Read
- DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
- KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
- NIMS Doctor Lakshmi Bhaskar: ఫ్లాట్లు, బంగారం, పెట్టుబడులు.. డాక్టర్ లక్ష్మీ భాస్కర్ రూ.100 కోట్ల ఆస్తులు గుర్తించిన ఏసీబీ..!
నిజానికి ఇలాంటి ప్రమాదాలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రమాదానికి కారణమైన వారు మాత్రం అక్కడి నుండి తప్పించుకునే క్రమంలో ఎవరి ప్రాణాలు పోయినా పట్టించుకునేలా లేరు. చట్టానికి తాము దొరక్కుండా ఉంటే చాలు అనే భావనతో ఢీకొట్టిన వెంటనే అక్కడి నుండి పారిపోతున్నారు. కానీ బాధితుల కుటుంబాలు, ఎంతోమంది స్నేహితులకు తీవ్రమైన వేదన మిగులుస్తున్నామని ఎవరికీ తెలీడం లేదు. ఈ ఆలోచన కూడా వారిలో ఉండడం లేదు. ఎవరేమైపోతే మాకేంటి? అనే నిర్లక్ష్యమే వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రమాదవశాత్తు ఢీకొట్టిన కనీసం గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుంది. అలా కాకుండా హిట్ అండ్ రన్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రాణాలు తీసే దుర్మార్గులను శిక్షించడానికి కఠినమైన చట్టాలు అమలులో ఉన్నాయి. సరైన సాక్షాధారాలు లభించిన వెంటనే పోలీసులు ఆయా సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి సకాలంలో నిందితులను పట్టుకుంటే ఎంతటివారైనా సరే ఈ చట్టాల నుండి తప్పించుకోవడం సాధ్యం కాదు. చట్టానికి భయపడేముందు.. కనీసం మానవత్వంతో ఆలోచిస్తే ఆక్సిడెంట్ కి తామే కారణమైనా ఒక విలువైన ప్రాణాలు కాపాడే ప్రయత్నం వల్ల కనీసం మనుషులమని నిరూపించుకోగలుగుతారు.
Agnipath Protest : జైలు బయట ఆర్మీ అభ్యర్థుల తల్లిదండ్రుల నిరీక్షణ
తాజావార్తలు
-
Zodiac Signs : దసరా వేళ ఈ 5 రాశులకు జాక్‌పాట్.!
-
Cine Dancers Association : డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతకు ఘోర పరాభవం, ప్యానెల్ రద్దు!
-
Pine Labs: నెల రోజుల్లో 25% ప్రాఫిట్.. మరో 30% పెరిగే ఛాన్స్ ఉందట!
-
Electric Scooter: ఒక్కసారి చార్జ్ చేస్తే 400 కి.మీ వెళ్లొచ్చు.. ఆఫీస్‌కు వెళ్లేవారికి బెస్ట్ ఇ-స్కూటర్ ఇదే..
-
Nani : డబ్బులిచ్చి నెగెటివిటీని స్ప్రెడ్ చేసే వాళ్లకే ఆ కోర్టు ఆర్డర్.. ఫేక్ రివ్యూలపై నాని షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!