Hyderabad Road Accident: ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు తరుచుగా ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ నగర పరిసిరల్లో రెండు దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ బెంగళూరు జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. పెద్దషాపూర్ తాండాకు చెందిన దుర్గ అనే మహిళ రహదారి దాటుతుండగా, అటుగా వేగంగా వెళ్తున్న బుల్లెట్ బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ…
Actor Divya Suresh: హిట్ అండ్ రన్ కేసులో బిగ్ బాస్ బ్యూటీపై కేసు నమోదైంది.. కన్నడ బిగ్ బాస్ ద్వారా కర్ణాటకలో బాగా ఫేమస్ అయిన నటి దివ్య సురేష్ పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.. బెంగుళూరులో యాక్సిడెంట్ చేసి పరారైన దివ్య సురేషపై హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు.. ఈ నెల 4వ తేదీన అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బైతరాయణపురలోని ఎంఎం రోడ్డులో ప్రమాదం చోటు…
Hit And Run Case: హైదరాబాద్ మహా నగరంలోని నార్సింగి పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదర్ షాకోట్ చౌరస్తా దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే, హైదర్ షాకోట్ ప్రాంతానికి చెందిన కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని కారు ఢీకొట్టింది.
Hit and Run: తాతలు, తండ్రులు ఆస్తులు సంపాదించారు. ఈ క్రమంలో ఒళ్లు తెలియకుండా ప్రవర్తించాడు. కన్ను మిన్నూ కానకుండా కారు నడిపించాడు. ఒకరి మృతికి కారణమయ్యాడు. ఐతే స్థానికులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో నిందితున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎవరతడు? అసలు జరిగిందేంటి? హైదరాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు.. అతడి కార్ వేగానికి అంతులేదు.. ఎవరైనా అడ్డం వస్తే అలాగే ఢీకొడతాడు. ఇంకా చెప్పాలంటే కారుకు బ్రేక్‌లున్నా పెద్దగా వాడడు.…
Tragedy: ఢిల్లీ సమీపంలోని గురుగ్రామ్‌లో ఓ దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఒక సివిల్ ఇంజినీర్ నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా న్యాయ విద్యార్థి ప్రాణం కోల్పోయాడు. లీగల్ స్టూడెంట్ హర్ష్ తన స్నేహితుడు మోక్ష్‌తో కలిసి జూన్ 24న తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఢిల్లీ-జైపూర్ హైవే వద్ద ఉన్న చంచల్ దాబాకు వెళ్లాడు. అప్పటికే దాబా కిక్కిరిసిపోయిన కారణంగా వారు బయటే వేచి ఉండగా, మరో స్నేహితుడు అభిషేక్ కూడా అక్కడికి చేరాడు. ముగ్గురూ సర్వీస్ రోడ్…
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో చాలా విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మధ్యలో చిక్కుకున్న పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని 44 ఏళ్ల సిజోగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిజో మంగళవారం రాత్రి తన కుక్కలకు మాంసం స్క్రాప్‌లు కొని ఇంటికి తిరిగి వస్తున్నాడు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బైక్ రేసర్ బీర్ బాటిల్‌తో కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటన కలకలం రేపింది. టోలిచౌకి నుండి వేగంగా వస్తున్న ఖాజా అనే బైక్ రేసర్ ఓ కారును ఢీకొట్టాడు. ఈ ఘటన బంజారాహిల్స్ ఒమేగా హాస్పిటల్స్ రోడ్డులో చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం కార్ డ్రైవర్, ఖాజా మధ్య వాగ్వాదం తలెత్తింది. అప్పుడే కానిస్టేబుల్ శ్రీకాంత్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధుల కోసం వెళ్తున్నాడు. ఈ ఘర్షణను గమనించిన కానిస్టేబుల్ శ్రీకాంత్ వారిని శాంతింపజేయడానికి ప్రయత్నించాడు.
హైదరాబాద్‌లోని బాలనగర్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు సంచలనం రేపింది. మద్యం మత్తులో ఓ యువకుడు ఫార్చునర్ కారుతో యువతిని బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో 19 ఏళ్ల యువతి సాయి కీర్తి తీవ్రంగా గాయపడింది. ఈ రోజు ఉదయం బాలనగర్ ఐడీపీఎల్ చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. ఫార్చునర్ కారులో అతివేగంగా ప్రయాణిస్తున్న యువకుడు మద్యం మత్తులో ఉండటంతో అదుపుతప్పి రోడ్డుపై నడుస్తున్న సాయి కీర్తిని ఢీకొట్టాడు.
హైదరాబాద్ నగరంలో మరోసారి హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగిలో జరిగిన ఈ ఘోర ప్రమాదంలో యువ ఇంజనీర్ నవీన్ చారీ ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ఆసక్తితో, ఆశలతో తన మొదటి ఉద్యోగం ప్రారంభించిన నవీన్ చారీ ఆ రోజు పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ఈ విషాదం జరిగింది. కోకాపేట్ టీ-గ్రీల్ వద్ద నవీన్ చారీ తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం అతడిని వేగంగా ఢీకొట్టింది.…
హైదరాబాద్ నగరంలో మరో హిట్ అండ్ రన్ ఘటన చోటు చేసుకుంది. నార్సింగి పరిధిలో హిట్ అండ్ రన్ కేసు ఇది రెండోది. శనివారం ఒక ఘటన జరగగా.. మరో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. నడుచుకుంటూ వెళుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది.