Bangladesh: బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ దుస్సాహసానికి పాల్పడ్డారు. భారత సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చి, ఇక్కడి ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి బోర్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్(BGB) అక్రమంగా అస్సాంలోకి ప్రవేశించారు. అస్సాంలో బంగ్లాదేశ్ సరిహద్దులకు సమీపంలో హిందూ ఆలయ పునరుద్ధరణను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఆలయం బంగ్లాదేశ్లో ముస్లింలను కించపరుస్తుందని, అక్కడ హింస చెలరేగుతుందని చెప్పారు.
Himanta Biswa Sarma: బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ 20 శాతం టిక్కెట్లను అమ్ముకుంటుందని ఆరోపించారు.
Assam : అస్సాంలో బంగ్లాదేశ్ చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీని కింద అస్సాం నుండి 17 మందిని తరలించారు. ఇందులో తొమ్మిది మంది పెద్దలు, ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు.
Giriraj Singh: బ్రిటీష్ కాలం నుంచి అమలులో ఉన్న అస్సాం అసెంబ్లీలోని రెండు గంటల నమాజ్ విరామాన్ని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ఎత్తేసింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ శనివారం ప్రశంసించారు.
NDA Splits Over Jumma Break: అస్సాం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ప్రతి మత విశ్వాసానికి దాని సంప్రదాయాలను కాపాడుకునే హక్కులను కాలే రాసే విధంగా ఉంది.
Himanta Biswa Sarma: యూనిఫాం సివిల్ కోడ్ అమలులో భాగంగా అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం కీలక బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది. ముస్లిం వివాహాలు-విడాకులను ప్రభుత్వం దగ్గర తప్పనిసరిగా నమోదు చేయాలనే బిల్లుని తీసుకువచ్చింది. ఈ బిల్లు కాజీ వ్యవస్థను రద్దు చేయడంతో పాటు బహుభార్యత్వం, బాల్య వివాహాలకు అడ్డుకట్ట వేయనుంది. కాంగ్రెస్ వంటి విపక్షాలు ఈ బిల్లుని విమర్శిస్తున్నప్పటికీ ఇది బాలికల అభ్యున్నతికి కీలక బిల్లు అని అస్సాం ప్రభుత్వం చెబుతోంది.
Assam: యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేసే దిశగా అస్సాంలోని హిమంత బిశ్వ సర్మ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. అస్సాం అసెంబ్లీ గురువారం రాష్ట్రంలోని ముస్లిం వివాహాలు-విడాకులుకు సంబంధించి పాత చట్టాన్ని తొలగించి, వివాహాలు విడాకులకు ప్రభుత్వ నమోదును తప్పనిసరి చేసే బిల్లును ఆమోదించింది.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాలీ మాట్లాడే మియా ముస్లింలు అస్సాం రాష్ట్రాన్ని ఆక్రమించుకోనివ్వమని ఆయన అన్నారు. మైనారిటీ ఓట్ల కోసం తాను పోటీలో లేనని చెప్పారు. నాగావ్లో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలపై చర్చించేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ తీసుకొచ్చిన వాయిదా తీర్మానాలపై అసెంబ్లీలో శర్మ మాట్లాడారు.
Champai Soren: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీలో చేరిక ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ (ట్వీటర్) వేదికగా సోమవారం అర్ధరాత్రి ఒక పోస్ట్ చేశారు.