Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష ఉపనేతగా ఉన్న గౌరవ్ గొగోయ్ పై అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ విమర్శలను మరింత రెట్టింపు చేవారు. గౌరవ్ గొగోయ్ కి పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్న హిమంత, ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎంపీకి పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ నుంచి ఆహ్వానం అందిందని, అందుకే పొరుగు దేశం వెళ్లారని ఆరోపించారు. గొగోయ్ ట్రైనింగ్ పొందడానికి పాకిస్తాన్ వెళ్లారని, ఇది…
Congress vs BJP: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గోగోయ్ పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్ ) వేదికగా చేసిన పోస్టులో.. ఎంపీ గోగోయ్ పాకిస్తాన్, నేపాల్ దేశాల్లో పర్యటనలకు సంబంధించిన "స్పష్టమైన ఆధారాలు" తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు.
IND vs Ban: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ లో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం పాకిస్తాన్‌పై కఠినమైన చర్యలు విధిస్తుంది. ఈ నేపథ్యంలో పాక్ కు దగ్గర అవుతున్న బంగ్లాదేశ్‌పై కూడా ఇలాంటి చర్యలు తీసుకోవాలని ఈశాన్య భారతదేశంలోని కీలక రాజకీయ నాయకులు, పలు పార్టీలు పిలుపునిచ్చాయి.
Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ టార్గెట్‌గా అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘మీరు 15 రోజులు పాకిస్తాన్లో బస చేశారా..? మీ భార్య పాకిస్తాన్‌కి చెందిన ఎన్జీవో నుంచి జీతం పొందుతుందా..?’’ అని ప్రశ్నలు సంధించారు. ఎక్స్ వేదికగా గొగోయ్‌కి ప్రశ్నల వర్షం కురిపించారు. ఎంపీ భార్య, వారి పిల్లల పౌరసత్వ స్థితిని కూడా ఆయన ప్రశ్నించారు.
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ.. ఈ దాడిపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ పాకిస్థాన్‌కు మద్దతు పలికాడు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి…
కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ తరచూ నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది. తాజాగా, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్.. కశ్మీర్‌పై నోరు పారేసుకున్నారు. కశ్మీర్ పాకిస్థాన్‌కు జీవనాడని, భవిష్యత్తులోనూ అది అలాగే ఉంటుందని, దానిని మేము వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ అంశంపై భారత ప్రభుత్వం స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్ తో దాయాదికి ఉన్న సంబంధమని స్పష్టం చేసింది. ‘‘విదేశీ భూభాగం జీవనాడి ఎలా అవుతుంది..? కశ్మీర్ భారత భూభాగం’’ అని తేల్చిచెప్పింది.
Northeast: బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ తన చైనా పర్యటనలో ‘‘ఈశాన్య రాష్ట్రాల’’ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చైనాను బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తూనే, భారతదేశానికి చెందిన ఏడు సిస్టర్ స్టేట్స్(ఈశాన్య రాష్ట్రాలు) ల్యాండ్ లాక్డ్గా ఉన్నాయని,
దేశంలో తొలిసారిగా, ఒక రాష్ట్రానికి సొంత ఉపగ్రహం (Satellite) ఏర్పాటు చేసుకోనున్నట్లు అస్సాం ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో సొంత ఉపగ్రహం కలిగిన మొదటి రాష్ట్రంగా అస్సాం త్వరలో అవతరించబోతోంది.
Himanta Sarma: అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్యపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ సర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ‘‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’తో సంబంధాలు ఉన్న ఒక సంస్థలో ఉద్యోగం చేస్తోందని హిమంత శర్మ ఆరోపించారు. ప్రత్యక్షంగా ఎవరి పేరు చెప్పకుండా బుధవారం నుంచి వరసగా ఎక్స్‌లో ట్వీట్స్‌తో విరుచుకుపడుతున్నారు. భారతదేశం అభ్యంతరం చెప్పినప్పటికీ 2015లో పాకిస్తాన్ హైకమిషనర్‌తో గౌరవ్ గొగోయ్ సమావేశం కావడాన్ని కూడా ఆయన…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వైపులా శత్రువులు చుట్టుముట్టినప్పటికీ జ్ఞానం, సైన్స్ ఉపయోగించి ఇజ్రాయెల్ ఎలా బలమైన దేశంగా మారింది.. దాని చరిత్ర గురించి మనం నేర్చుకోవాలని తెలిపారు.