హిమాచల్ ప్రదేశ్‌లో 68 అసెంబ్లీ స్థానాలకు గాను 40 స్థానాలను గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్ బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ, పార్టీ అభ్యర్థులు 15 స్థానాల్లో 2,000 కంటే తక్కువ మెజారిటీతోనే విజయం సాధించడం గమనార్హం.
గుజరాత్ ప్రజలు బీజేపీవైపేనని మరోసారి నిరూపించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన అనంతరం ఆయన బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.