తెలంగాణలో వాతావరణం మళ్లీ వేడెక్కింది. ఇటీవల కొన్నిరోజులు చల్లబడిన వాతావరణం భానుడి ప్రతాపం మళ్లీ సెగలు కక్కుతోంది. దీంతో బయటకు రావాలంటే ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాల్పుల తీవ్రత కూడా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయుడుపేటలో అత్యధికంగా 44.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఖమ్మం జిల్లా మధిరలో 43.9 డిగ్రీల సెల్సియస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొత్తపల్లెగోరిలో 43.8 డిగ్రీల సెల్సియస్, మహబూబాబాద్ జిల్లా గార్లలో…
వేసవి కారణంగా దేశమంతటా అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అడవుల్లో తీవ్రమైన కార్చిచ్చులు సంభవించే అవకాశాలు ఉన్నాయని ఇంధనం, పర్యావరణం, నీటి వనరుల పర్యవేక్షణ మండలి విడుదల చేసిన అధ్యయనం హెచ్చరికలు జారీ చేసింది. భారతదేశంలో 30 శాతం జిల్లాల్లో తీవ్ర కార్చిచ్చులు సంభవించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. ముఖ్యంగా ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, ఒడిశాలోని కుందమాల్ జిల్లాలకు కార్చిచ్చుల ముప్పు ఉందని వార్నింగ్ ఇచ్చింది. వరదల నుంచి అనావృష్టికి, అనావృష్టి నుంచి వరదలకు…