లాక్ డౌన్ పై తెలంగాణ హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఇతర రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి ? అని హైకోర్టు సీరియస్ అయింది. కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేకుండా ఇంత సడెన్ నిర్ణయం ఏంటి ? అని నిలదీసింది. ఇతర ప్రాంతాల వాళ్ళు తక్కువ టైమ్ లో ఎలా వెళతారు ? అని హైకోర్టు ప్రశ్నించింది. ఇవాళ ఉదయం 10 గంటల వరకు మీకు కనీసం వీకెండ్ లాక్ డౌన్ ఆలోచన లేదని.. సడెన్ గా రేపటి నుంచి లాక్ డౌన్ అంటే ఎలా ? అని హైకోర్టు నిలదీసింది. ఇడియా ఇలా ఉండగా.. కరోనా నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి పదిరోజులపాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యవసర వస్తువులు, మెడిసిన్ ఇతర వస్తువులు కొనుగోలు చేయడానికి అనుమతులు ఇచ్చారు. ఉదయం 10 గంటల తరువాత ఎవరూ బయటకు రాకూడదు. లాక్‌డౌన్ మినహాయింపులు ఉన్న అత్యవసర సర్వీసులు, లాక్ డౌన్ పాసులు ఉన్న వారికి మాత్రమే అనుమతులు ఉంటాయి.