చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేసిన అమర రాజా కంపెనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. అమర రాజా పరిశ్రమను మూసివేయాలని ఇటీవలే పీసీబీ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా పరిశ్రమకు విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. దీంతో కంపెనీ యాజమాన్యం హైకోర్టులో కేసులు ఫైల్ చేసింది. ఈ కేసును విచారించిన హైకోర్టు పీసీబీ ఆదేశాలను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది. విద్యుత్ ను పునరుద్ధరణ చేయాలనీ ఆదేశించింది. జూన్ 17 వ తేదీలోగా ఆదేశాలను అమలు చేయాలనీ పీసీబీకి సూచించింది హైకోర్టు. రిపోర్ట్ ను మళ్ళీ ఫైల్ చేయాలనీ పీసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 28 వ తేదీకి వాయిదా వేసింది.