Iran : ఉత్తర ఇజ్రాయెల్‌లోని బీట్ హిల్లెల్ నగరంపై ఆదివారం హిజ్బుల్లా కత్యుషా రాకెట్లను ప్రయోగించారు. ఇరాన్ నుంచి నిరంతర మద్దతు పొందుతున్న ఈ ఉగ్రవాద సంస్థ.. పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపే ఉద్దేశంతో ఈ దాడులు జరిగాయని పేర్కొంది.
Israel: ఇజ్రాయిల్ శత్రువులుగా భావిస్తున్న ఇద్దరు కేవలం 12 గంటల వ్యవధిలోనే హతమార్చబడ్డారు. టెహ్రాన్‌లో హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్యకు గురయ్యాడు. దీనికి కొన్ని గంటల ముందు లెబనాన్ నుంచి పనిచేస్తున్న హిజ్బుల్లా కమాండర్ ఫువాద్ షుక్ర్ బీరూట్‌లో చంపబడ్డాడు.
హమాస్ మిలిటెంట్ల స్థావరాలున్న గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడుల్లో దారుణం జరిగింది. ఈ దాడుల్లో 13 మంది బందీలు ప్రాణాలు కోల్పోయారని హమాస్ మిలిటరీ ప్రకటించింది.
Israel: ఇజ్రాయిల్ ఆర్మీ హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలపై విరుచుకుపడింది. 40 టెర్రర్ టార్గెట్స్‌ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బుధవారం తెలిపింది.
హమాస్పై యుద్ధంతో ఇరాన్ మద్దతు గల సంస్థ హిజ్బుల్లా సోమవారం నాడు అర్థరాత్రి ఇజ్రాయెల్‌పై 35 రాకెట్లతో దాడి చేసింది. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేసినట్లు హిజ్బుల్లా పేర్కొంది.
ఇజ్రాయెల్ దళాలు గాజాలో హమాస్ పై దాడులు చేస్తున్న భాగంలో.. హెజ్ బొల్లా., గాజాకు మద్దతుగా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. దింతో హెజ్ బొల్లా పై ప్రతీకారంగా ఇజ్రాయెల్ దళాలు కూడా దాడులు చేస్తున్నాయి. ఇకపోతే., మరోసారి ఇజ్రాయెల్ దళాలు ఆ హెజ్ బొల్లా మిలిటెంట్ గ్రూప్ పై త్రీవ స్థాయిలో విరుచుకుపడ్డాయి. దాంతో ఇజ్రాయెల్ దళాలు బుధవారం నాడు సిరియాపై భారీగా దాడులు నిర్వహించాయి. ఇందులో భాగంగా సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్ కు…
Israel: లెబనాన్‌పై ఇజ్రాయిల్ విరుచుకుపడింది. శుక్రవారం భారీగా వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్ రాకెట్ యూనిట్ డిప్యూటీ హెడ్ మరణించినట్లు తెలిపింది.
Israel: ఇజ్రాయిల్ అక్టోబర్ 7 నాటి హమాస్ మిలిటెంట్ల దాడి తర్వాత, హమాస్‌ని కుప్పకూల్చాలనే లక్ష్యంలో బిజీగా ఉండగా.. మరోవైపు లెబనాన్ నుంచి హమాస్‌కి మద్దతుగా హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులకు తెగబడుతున్నారు. తాజాగా హిజ్బుల్లా ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతంలోని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) స్థావరాలపై రాకెట్ల వర్షం కురిపించారు. శనివారం ఇజ్రాయిల్ సైనిక స్థావరాలపై 60కి పైగా రాకెట్లను ప్రయోగించినట్లు హిజ్బుల్లా ప్రకటించింది. బీరూట్‌లో హమాస్ డిప్యూటీ లీడర్‌ని హతమార్చినందుకు ప్రతిస్పందనగా ఈ దాడికి పాల్పడినట్లు వివరించింది.
Israel: ఇరాన్ ప్రాక్సీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దోల్లాహియాన్‌తో బీరుట్‌లో సమావేశమయ్యారని లెబనీస్ మూమెంట్ గురువారం తెలిపింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి లెబనాన్, ఇజ్రాయిల్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇజ్రాయిల్ ఉత్తర సరిహద్దుపై హిజ్బుల్లా మిలిటెంట్లు దాడులకు పాల్పడుతున్నారు.