కోవిడ్ టైంలో కొంత మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడ్డారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొంతమంది అమ్మాయిలు కూడా గంజాయికి అలవాటు పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఇంటర్ నేషనల్ స్కూల్ వద్ద బయట కొంత మంది డ్రగ్స్ విక్రయిస్తున్నారని, డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆయన తెలిపారు. ఓచ్చే 10 సంవత్సరాల్లో ప్రధానంగా రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకటి ఎంప్లాయ్ మెంట్ రెండు మాదక…
రోజురోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. స్మగ్లింగ్ చేయడంలో కొత్తకొత్త పంథాలను తొక్కుతూ పోలీసులకు చిక్కి జైలు ఊసలు లెక్కెడుతున్నారు. అయితే ఈ రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్డ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని గేట్ నెంబర్ 11 వద్ద అనుమానాస్పద కవర్ ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు ఆ కవర్‌ను జాగ్రత్తగా తెరిచిచూడడంతో అందులో 51 క్యాపసల్స్ లో నింపిన కొకైన్‌ను గుర్తించారు. దీంతో మరోసారి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం…
మాదకద్రవ్యాలకు యువతే కాకుండా ఎంతో చదువుకున్న వైద్యులు కూడా బానిసలవుతున్నారు. ఢిల్లీ డ్రగ్స్ కేసులో హైదరాబాద్‌రె చెందిన డాక్టర్ కు ప్రమేయం ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఢిల్లీలో డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న కేసులో ఇప్పటికే నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు 22 మంది అరెస్ట్ చేశారు. అయితే ఇందులో హైదరాబాద్ కు చెందిన వైద్యుడు ఆదిత్య రెడ్డి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆదిగ్య రెడ్డి సైకియాట్రిస్ట్ గా పనిచేస్తున్నారు. మానసిక రోగులపై ఈ డ్రగ్స్…
డ్రగ్స్ వ్యవహారంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లో పాలక, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది… తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చిన టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్… డ్రగ్స్ బిగ్ బాస్ ఎవరూ అంటే బ్రోకర్ సజ్జల ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? అంటూ ప్రశ్నించారు.. మా నాన్న మారిషస్-నేను దుబాయ్ అంటూ బొంబాయి కబుర్లు మాని, డ్రగ్స్ మాఫియా కింగ్ పిన్ జగన్ బినామీ ద్వారంపూడి…
దేశ రాజధానిలో ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు స్పెషల్ సెల్ పోలీసులు.. 2,500 కోట్ల రూపాయల విలువైన 354 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు.. డ్రగ్స్ రాకెట్‌కు సంబంధించిని నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.. ఈ ముఠాలో ఒకరు ఆప్ఘనిస్థాన్ జాతీయుడు. పంజాబ్ నుంచి ఒకరు, కాశ్మీర్ నుంచి ఒకరు.. మరొకరు ఢిల్లీకి చెందిన వ్యక్తి ఉన్నారని ఢిల్లీ పోలీసులు తెలిపారు.. ఢిల్లీ పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుకోవడం ఇదే తొలిసారి.…
వరుసగా దేశంలోని వివిధ ఎయిర్‌పోర్ట్‌లో భారీ ఎత్తున మాదకద్రవ్యాలు బయటపడడం ఆందోళన కలిగిస్తోంది… ఇవాళ ఢిల్లీ ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు అధికారులు.. జోహాన్నెస్ బర్గ్ నుండి ఢిల్లీ వచ్చిన ఇద్దరు ఆఫ్రికన్ ప్రయాణికుల నుంచి 120 కోట్ల విలువ చేసే 18 కేజీల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను ట్రాలీ బ్యాగ్ కింది భాగంలో దాచారు కేటుగాళ్లు… మాదకద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు గుర్తు పట్టకుండా బుట్టలలో దాచి…
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.. టాంజానియా దేశస్తుడి దగ్గర రూ.20 కోట్ల విలువచేసే హెరాయిన్ గుర్తించారు.. హెరాయిన్‌ను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచి తరలిస్తున్న జాన్ వియమ్స్ అనే వ్యక్తి నుంచి 3 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు… కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. దోహా నుంచి హైదరాబాద్‌కు హెరాయిన్ తీసుకొచ్చిన జాన్… ఆస్ట్రేలియాకు సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. వారం రోజుల క్రితం…
డ్రగ్స్ రవాణాలో ఇప్పుడు ఏకంగా విమానాలను ఉపయోగిస్తున్నారు కేటుగాళ్లు.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో సారి భారీగా డ్రగ్స్ పట్టివేశారు.. డర్బన్ నుండి ఢిల్లీ వచ్చిన టాంజానియా దేశస్తుడి నుండి 28 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.. హెరాయిన్ డ్రగ్‌ను హాండ్ బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ లో ప్రత్యేకంగా రంద్రాలు చేసి అందులో నింపాడు కేటుగాడు. ఢిల్లీ విమనాశ్రయంలో ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతని లగేజ్ బ్యాగ్‌ను క్షుణంగా తనిఖీ చేసింది…
మహారాష్ట్ర ప్రభుత్వం కాస్త వెసులుబాటు ఇవ్వటంతో బాలీవుడ్ చకచకా సెట్స్ మీదకి బయలుదేరుతోంది. ఇప్పటికే ఒకట్రెండు పెద్ద సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు కెమెరా ముందుకు వెళ్లాయి. ఇప్పుడు అక్షయ్ కుమార్ స్టారర్ ‘రక్షాబంధన్’ కూడా షూటింగ్ మొదలు పెట్టేసింది. ఆనందర్ ఎల్. రాయ్ దర్శకత్వంలో అన్నాచెల్లెళ్ల అనుబంధంపై ఈ సినిమా రూపొందిస్తున్నారు. అయితే, తాజాగా భూమి పెడ్నేకర్ కూడా ‘రక్షాబంధన్’ టీమ్ లో జాయిన్ అయింది. ఆమె పాత్ర గురించి ఇంకా పెద్దగా డిటైల్స్ తెలియకున్నా…
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు భారీగా హెరాయిన్‌ను పట్టుకున్నారు. అఫ్రికాలోని జాంబియా, ఉగాండా దేశాల నుంచి వచ్చిన మహిళల నుంచి రూ.78 కోట్ల రూపాయల విలువైన 12 కిలోల హెరాయిన్‌ను డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసులకున్నారు. జోహెన్నస్ బర్గ్ నుంచి దోహామీదుగా హైదరాబాద్‌కు చేరుకున్న ఈ మహిళల నుంచి పెద్దమొత్తంలో హెరాయిన్ స్వాదీనం చేసుకున్న అధికారులు, ఆ డ్రగ్ ను ఎవరికి సరఫరా చేస్తున్నారనే విషయంపై దృష్టిసారించారు. సూట్‌కేసుల పైపుల మధ్యలో ఉంచి ఈ డ్రగ్స్‌ను స్మగ్లింగ్…