రోజురోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. స్మగ్లింగ్ చేయడంలో కొత్తకొత్త పంథాలను తొక్కుతూ పోలీసులకు చిక్కి జైలు ఊసలు లెక్కెడుతున్నారు. అయితే ఈ రోజు ఢిల్లీ ఎయిర్‌పోర్డ్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఎయిర్ పోర్ట్ లోని గేట్ నెంబర్ 11 వద్ద అనుమానాస్పద కవర్ ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు ఆ కవర్‌ను జాగ్రత్తగా తెరిచిచూడడంతో అందులో 51 క్యాపసల్స్ లో నింపిన కొకైన్‌ను గుర్తించారు. దీంతో మరోసారి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్స్ కలకలం రేగింది. ఈ మేరకు అధికారులు కవర్ లో 51 క్యాపసల్స్ లో నింపిన కొకైన్ సీజ్ చేశారు. సీజ్ చేసిన కొకైన్ విలువ 15 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే కస్టమ్స్ అధికారుల కదలికలను పసిగట్టి కొకైన్ తో ఉన్న కవర్‌ను దుండగులు గేట్ వద్ద వదలి వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ లో ఉన్న సీసీ టీవీ ఫూటేజ్ ను కస్టమ్స్ అధికారులు పరిశీలిస్తున్నారు. కవర్ ఎవరు తెచ్చారు? ఎక్కడి నుండి తెచ్చారు అనే వివరాలు సేకరించే పనిలో అధికారుల బృందం ఉంది. ఉదయం నుండి విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకుల వివరాలు అధికారులు తెలుసుకుంటున్నారు. కొకైన్ సీజ్ ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు.