డ్రగ్స్ రవాణాలో ఇప్పుడు ఏకంగా విమానాలను ఉపయోగిస్తున్నారు కేటుగాళ్లు.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం మరో సారి భారీగా డ్రగ్స్ పట్టివేశారు.. డర్బన్ నుండి ఢిల్లీ వచ్చిన టాంజానియా దేశస్తుడి నుండి 28 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను గుర్తించారు కస్టమ్స్ అధికారులు.. హెరాయిన్ డ్రగ్‌ను హాండ్ బ్యాగ్, ట్రాలీ బ్యాగ్ లో ప్రత్యేకంగా రంద్రాలు చేసి అందులో నింపాడు కేటుగాడు. ఢిల్లీ విమనాశ్రయంలో ప్రయాణికుడిపై అనుమానం వచ్చి అతని లగేజ్ బ్యాగ్‌ను క్షుణంగా తనిఖీ చేసింది అధికారుల బృందం.. సుమారు 4 కేజీల గోధుమ రంగంలో వున్న హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్కనారు కస్టమ్స్ అధికారులు. ప్రయాణికుడిని అరెస్ట్ చేసి.. విచారణ చేపట్టారు.. అతడి వెనుకాల ఎవరెవరు ఉన్నారనే సమాచారాన్ని కూపి లాగుతున్నారు.