‘టాయిలెట్’ మూవీ టాలెంటెడ్ బ్యూటీతో… మళ్లీ అక్షయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ప్రభుత్వం కాస్త వెసులుబాటు ఇవ్వటంతో బాలీవుడ్ చకచకా సెట్స్ మీదకి బయలుదేరుతోంది. ఇప్పటికే ఒకట్రెండు పెద్ద సినిమాలు, కొన్ని చిన్న సినిమాలు కెమెరా ముందుకు వెళ్లాయి. ఇప్పుడు అక్షయ్ కుమార్ స్టారర్ ‘రక్షాబంధన్’ కూడా షూటింగ్ మొదలు పెట్టేసింది. ఆనందర్ ఎల్. రాయ్ దర్శకత్వంలో అన్నాచెల్లెళ్ల అనుబంధంపై ఈ సినిమా రూపొందిస్తున్నారు. అయితే, తాజాగా భూమి పెడ్నేకర్ కూడా ‘రక్షాబంధన్’ టీమ్ లో జాయిన్ అయింది. ఆమె పాత్ర గురించి ఇంకా పెద్దగా డిటైల్స్ తెలియకున్నా కథలో కీలక పాత్ర అంటున్నారు. అక్షయ్, భూమి గతంలో ‘టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ’ సినిమాలో జంటగా నటించారు. ‘రక్షాంబంధన్’ అప్ డేట్ అభిమానులకి తెలియజేస్తూ అక్షయ్ కుమార్ ఓ ఫోటో షేర్ చేశాడు.
అందులో ఆనంద్ ఎల్. రాయ్, అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ చాలా ఖుషీగా నవ్వేస్తున్నారు. ఆ హ్యాపీ పిక్ ఫ్యాన్స్ తో పంచుకున్న అక్కీ ‘భూమి పెడ్నేకర్ ని ‘రక్షాబంధన్’ టీమ్ లోకి ఆహ్వానిస్తున్నాం!’ అని ప్రకటించాడు. అదే ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన భూమి కూడా ‘అనందర్ ఎల్. రాయ్, అక్షయ్ లాంటి క్రియేటివ్ పవర్ హౌజెస్ తో పని చేయటం అదృష్టంగా భావిస్తున్నాను!’ అని కామెంట్ చేసింది. అక్షయ్ అప్ కమింగ్ మూవీస్ చాలానే ఉన్నాయి… ‘రక్షాబంధన్’తో పాటూ ‘పృథ్వీరాజ్, అత్రంగీ రే, బచ్చన్ పాండే, బెల్ బాటమ్, ఓ మై గాడ్ 2’ వంటి సినిమాల్లో ఖిలాడీ కుమార్ కనిపించనున్నాడు.
Also Read
- NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
- Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్‌పై హాట్ చర్చ!
- Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
- Prashanth Neel: ‘డ్రాగన్’ షూటింగ్‌కు బ్రేక్.. ప్రభాస్‌తో ‘సలార్-2’ మొదలుపెట్టనున్న ప్రశాంత్ నీల్?
తాజావార్తలు
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
-
Ganja Smuggling: టెక్నాలజీతో గంజాయి దందా.. బాలానగర్‌లో గంజాయి స్మగ్లర్ల కొత్త స్కెచ్!
-
Be Alert: దంపతుల దారుణ హత్య..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!