ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తికి కడుపునొప్పి వస్తుందని ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు అతన్ని పరీక్షించి హెర్నియా కోసం శస్త్రచికిత్స చేశారు. ఆ సమయంలో డాక్టర్లు షాక్ కు గురయ్యారు. అతని శరీరం లోపల స్త్రీ పునరుత్పత్తి అవయవాలను కనుగొన్నారు.