Helen: అప్పట్లో హెలెన్ ఐటమ్ సాంగ్స్ కోసమే జనం థియేటర్లకు పరుగులు తీసేవారు. ఐటమ్ గాళ్స్ లో సూపర్ స్టార్ అనిపించుకున్న మేటి డాన్సర్ హెలెన్. ఆమె కొన్ని చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే వందలాది సినిమాల్లో ఐటమ్స్ తోనే మురిపించారామె. హెలెన్ దాదాపు 700 చిత్రాలలో తెరపై వెలుగులు విరజిమ్మారు. హెలెన్ తన డాన్సులతో చేసిన మ్యాజిక్ ఈ నాటికీ జనాల మదిని గిల్లేస్తూనే ఉందంటే అతిశయోక్తి కాదు.