ఒకవైపు సూరీడు మండిపోతున్నాడు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వీటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్ బీర్ కావాలంటున్నారు. గత కొన్నాళ్ళుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. విస్కీ, ఇతర మద్యం అమ్మకాలు కూడా 3 శాతం పెరిగాయి. అన్ని రకాల మద్యం అమ్మకాలు సేల్ వాల్యూపరంగా చూస్తే గత…
ఒకవైపు మండే ఎండ, మరోవైపు హఠాత్తుగా చిరుజల్లులతో వాతావరణం చల్లబడుతోంది. ఎండలో తిరిగి అలసిన వారికి చిరుజల్లులు ఉపశమనం కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, రాయలసీమ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో మాత్రం ఎండలు మండుతాయని జాగ్రత్తగా వుండాలని ఐఎండీ సూచించింది. 26వ తేదీ వరకు…