అంతర్జాతీయ యోగా దినోత్సవానికి విశాఖపట్నం కేంద్రంగా మారనుంది.. ఇప్పటికే యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో.. వైజాగ్ ఎయిర్ పోర్ట్‌లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోడీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. విశాఖ ఎయిర్ పోర్ట్‌కు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు.
ఏపీలో గురువారం మూడు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పోలింగ్‌తో పాటు ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అందుకోసం.. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
మంచు మనోజ్‌కు తాజాగా నోటీసులు జారీ చేశారు పోలీసులు.. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీకి మంచు మనోజ్ వస్తారన్న సమచారంతో అప్రమత్తమైన పోలీసులు.. శాంతి భద్రతల దృష్ట్యా.. మోహన్‌బాబు యూనివర్సిటీలోకి అనుమతి లేదంటూ మనోజ్ నోటీసులు ఇచ్చారు..
మోహన్‌బాబు యూనివర్సిటీ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.. తన కుమారుడు మంచు మనోజ్.. ఎంబీయూకు వస్తారన్న సమాచారంతో పోలీసులను ఆశ్రయించారు మోహన్‌బాబు.. మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ రాకూడదంటూ కోర్టు ఉత్తర్వులు ఉన్న నేపథ్యంలో.. పోలీసులకు ఆ కోర్టు ఉత్తర్తుల గురించి సమాచారం ఇచ్చారు మోహన్ బాబు..
Warangal Police: నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో వరంగల్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిరసనకారులపై ప్రత్యేక నిఘా పెట్టారు.
Polling Centers: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో రేపు జరిగే పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత కొద్దిరోజులుగా కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
Shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. రెండు రోజుల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం జరగనున్న నేపథ్యంలో సోయాంక, రాహుల్, సోనియా హైదరాబాద్ రానున్నారు.
TS Police: నేడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈనేపథ్యంలో అమర వీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవానికి 2300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠరేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు పోలీసులు పటిష్ఠ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలు పహారా కాస్తున్నాయి.