Mandous Cyclone : మాండూస్ తుపాన్ కారణంగా చెన్నై నగరం చెత్తమయమైంది.ఈ నెల 9వ తేదీన తుపాను తీరం దాటే సమయంలో ఈదురు గాలులకు 100కు పైగా ప్రాంతాల్లో 207 చెట్లు, చెట్ల కొమ్మలు రోడ్లపై పడ్డాయి. 9వ తేదీ రాత్రి నుంచి కార్పొరేషన్ కార్మికులు చెట్లు, చెట్ల కొమ్మలన్నీ తొలగించారు. ఇలా మొత్తం 644 టన్నుల కలప వ్యర్థాలను 100 టిప్పర్ ట్రక్కుల్లో 291 స్టేజీల్లో కొడుంకయ్యూరు, పెరుంగుడికూపి డంపింగ్ యార్డులకు తరలించారు. ఈ వ్యర్థాలను తొలగించేందుుకు చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ 261 ట్రీ సావింగ్ మిషన్లు, 67 టెలీస్కోపిక్ సావింగ్ మిషన్లు, 2 వెహికల్ మౌంటెడ్ సావింగ్ మిషన్లు, 6 హైడ్రాలిక్ సావింగ్ మిషన్లను ఉపయోగిస్తోంది.
Read Also : బీచ్ ఒడ్డున బోండంతో.. జాన్వీ అందాల విందు
తుపానుకు ముందు పట్టినప్పక్కం బీచ్, అడయార్ వాగులో ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ కార్పొరేషన్ తొలగించింది. ప్రస్తుతం వర్షాలు కురవడంతో ఆయా ప్రాంతాల్లో మళ్లీ పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోయాయి. వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మరో రెండు రోజుల్లో పనులు పూర్తవుతాయని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. తుపాను కారణంగా ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా మెరీనా బీచ్‌ను మూసివేశారు. అక్రమార్కులను నిరోధించేందుకు నేపియర్ బ్రిడ్జి నుంచి లైట్ హౌస్ వరకు బీచ్ వెంబడి ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. పోలీసులు నిరంతరం నిఘా పనిలో నిమగ్నమై ఉన్నారు.
Read Also: Crude Oil : దిగొచ్చిన రష్యా.. పాకిస్తాన్‌కు క్రూడాయిల్ సరఫరాకు ఓకే
తుపాను తీరం దాటినా, వర్షం తగ్గుముఖం పట్టినా.. ఇప్పటికే మెరీనాలో పేరుకుపోయిన వర్షపు నీరు ఇంకా పూర్తిగా ఇంకిపోకపోవడంతో పోలీసులు ఆదివారం మెరీనా బీచ్‌లోకి వెళ్లేందుకు ప్రజలను అనుమతించలేదు. ఆదివారం సెలవు దినం కావడంతో పట్టినపక్కం బీచ్ కు జనం పోటెత్తారు.