ఐరోపా దేశమైన స్పెయిన్‌ను వరదలు అతలాకుతలం చేస్తు్న్నాయి. తీవ్రమైన తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాల వల్ల జరాగోజా నగరంలో వరద బీభత్సం నెలకొంది. భారీ వర్షం కారణంగా అనేక వీధులు జలమయమయ్యాయి.
Pakistan Rains: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా చోట్ల ఇళ్లు దెబ్బతినగా, రోడ్లు చెరువులుగా మారాయి. బుధవారం ఇక్కడ కురిసిన భారీ వర్షం గత 30 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టగా కేవలం 10 గంటల్లోనే 290 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రమాదాలు కూడా అదే స్థాయిలో జరిగే అవకాశం ఉంది. వర్షాలకు విద్యుత్ స్థంబాల నుంచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. తాజాగా ఢిల్లీలో విషాదం చోటుచేసుకుంది.
Assam Floods: బిపార్జోయ్ తుఫాను ఉత్తరాదిని వణికిస్తోంది. గుజరాత్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. బిపార్జోయ్ కారణంగా అస్సాంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అస్సాంలోని 7 జిల్లాల్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది.
హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో రానున్న మూడు గంటలపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న రాత్రి కూడా నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. వాహనదారులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Read Also: CM KCR Yadadri Tour: నేడు యాదాద్రికి…
తెలంగాణలో గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తడిసి ముద్దవుతున్న రాష్ట్ర ప్రజలకు మరో షాక్ తగలనుంది. తెలంగాణాకు రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌తో పాటు హైదరాబాద్ సహా తెలంగాలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి.. అయితే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ చెబుతోంది.. పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న తూర్పుమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది… ఇది రానున్న 48 గంటల్లో పశ్చిమ మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల వెంబడి బలపడుతోందని తెలిపారు…
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షంతో పాటు, ఈ రోజు అత్యంత భారీ వర్షాలు అక్క డక్కడ వచ్చే అవకాశం ఉందని.. ఎల్లుండి భారీ వర్షాలు అక్క డక్కడ పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.