గురువారం తెలంగాణలో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జిల్లాల్లో రెడ్ అలర్ట్ అమల్లో ఉండనుంది. జూలై 21 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని తెలిపింది.
Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా 2-3 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
భారీ వర్షాల కారణంగా ముందుజాగ్రత్త చర్యగా రెండు మార్గాల్లో అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా శనివారం నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గత రాత్రి నుంచి బల్తాల్, పహల్గాం మార్గాల్లో అడపాదడపా భారీ వర్షాలు కురుస్తున్నాయని వారు వెల్లడించారు.
Delhi Rains : ఢిల్లీలో తొలి రుతుపవనాల ప్రభావం ఎయిమ్స్‌పై కూడా కనిపించింది. వర్షం కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లోని ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది ఆపరేషన్ థియేటర్లు మూతపడ్డాయి. ఆపరేషన్ థియేటర్లు మూతపడటంతో డజన్ల కొద్దీ శస్త్రచికిత్సలు ఆగిపోయాయి.
రాబోయే ఐదు రోజుల్లో కేరళ, కర్ణాటక, గోవాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఆయా రాష్ట్రాలు వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందాయి.
సిక్కింలో భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యాటకులను రక్షించారు. భారీ వర్షాల మధ్య బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వారిన సేఫ్ చేసింది. మంగన్ నుండి లాచుంగ్ మార్గంలో పెద్ద ఎత్తున వరదలు రావడంతో.. 15,000 మంది పర్యాటకులు వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నారు. మరోవైపు.. భారీ వర్షాలు, వరదల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. అంతేకాకుండా.. రోడ్డు రవాణాకు తీవ్ర అంతరాయం…
దేశ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో వాతావరణం కూల్ కూల్‌గా మారిపోయింది. ఇక ఆయా రాష్ట్రాల్లో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి.. రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ పెద్దపల్లి జిల్లా, మంథని మండలంలో ఈదురు గాలులకు భారీగ చెట్లు విరిగిపడ్డాయి. దీనితో అక్కడ ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో..రానున్న రెండు రోజులో గ్రేటర్ లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో గ్రేటర్‌కు ఎల్లో…
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాబోయే ఐదు రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర వాతావరణ శాఖ రాష్ట్రాల లిస్టు విడుదల చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.